తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల పరిస్థితి తీవ్ర అయోమయంలో పడడానికి సీఎం కేసీఆరే కారణమని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.  ప్రభుత్వం, అధికారుల తీరుపై విద్యార్తులు, తల్లిదండ్రులు ఆగ్రహం.  బోర్డు ముట్టడించిన విద్యార్తి సంఘాలు.  ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణ. విద్యార్థి నేతల అరెస్ట్ చేసిన పోలీసులు.  విద్యార్థులు, తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసిన వైనం. 

విద్యాశా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్.  కాగా, రీ కౌంటింగ్, రి కరెక్షన్ చేయించుకోండని రాజకీ నాయకులు, అధికారులు తల్రిదండ్రులకు, విద్యార్థులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. తాజాగా ఈ నెల 18న ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మార్కుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం అందరినీ కలచివేస్తోంది.

తాజాగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా రంగప్రవేశం చేశారు. ఇంటర్ బోర్డు వద్దకు ఆయన రావడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. రేవంత్ అండగా విద్యార్థుల తల్లిదండ్రులు ఊగిపోయారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. పరిస్థితి మరి శృతి మించి పోయేలా ఉందని గ్రహించిన పోలీసులు  రేవంత్ ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే సంపత్ ను కూడా అరెస్ట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: