నిన్న ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన రోజుగా అందరూ భావిస్తున్నారు.  ఈస్టర్ పండుగ వేడుకలో అందరూ సంతోషంగా చర్చిల్లో దైవ సన్నిధిలో ఉండగా బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది.  ఉద్రవాదులు పంజా విసిరారు.  చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఎక్కడిక్కడ శవాలు చెల్లాచెదురై పడిపోయారు.  శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ళలో ఇద్దరు కన్నడిగులు మరణించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి సోమవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఏడుగురు జేడీఎస్ నేతలు కొలంబో సందర్శనకు వెళ్ళారు. 


శ్రీలంక విహార యాత్రకని వెళ్లిన ఏడుగురు జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) నాయకుల్లో ఇద్దరు చనిపోయినట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. రెండో విడత ఎన్నికల తర్వాత ఈనెల 20న ఈ ఏడుగురు నాయకులు శ్రీలంకకు వెళ్లారు.  వీరిలో కే జీ హనుమంతరాయప్ప, ఎం రంగప్ప మరణించినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తోపాటు శ్రీలంకలోని ఇండియన్ హైకమిషన్ ధ్రువీకరించింది. 


నలుగురు నేతలు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి వెల్లడించారు. నే కాగా, జేడీఎస్‌ నేతల్లో లక్ష్మణ గౌడ రమేశ్‌, కేఏం లక్ష్మీనారాయణ్‌, ఎం. రంగప్ప, కేజీ హనుమంతరాయప్ప మృతి చెందగా.. మరో ముగ్గురు హెచ్‌. శివు కుమార్‌, ఎ. మారెగౌడ, హెచ్‌ పుట్టరాజు ఆచూకీ ఇంకా తెలియ రాలేదని కుమార స్వామి తెలిపారు.


మా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు శ్రీలంక పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. న్యూదిల్లీలోని కర్ణాటక భవన్‌ నుంచి ఆయనకు సమాచారం అందుతోంది. బాధితుల కుంటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. వారి కుటుంబాలు ఈ బాధ నుంచి తర్వగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను  అని కుమార స్వామి ట్వీట్‌ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: