అత్యంత ఉత్కంఠభరితంగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికార పీఠాన్ని కైవశం చేసుకుంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ విశ్వసనీయమైన నివేదిక ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. ఏపీలో వచ్చేది జగన్ నాయకత్వంలోని ప్రభుత్వమేనని ఆ సర్వే వెల్లడిస్తోంది.


ఏపీలో ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగిన సంగతి తెలిసిందే. ఈ పోటీలో వైసీపీ, టీడీపీ నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. దాంతో ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపైన చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. ఇక ఇపుడు అంత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తున్నది ఏంటంటె ఏపీలో వైసీపీ 105 అసెంబ్లీ సీట్లను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని. అలాగే 15 వరకూ ఎంపీ సీట్లు ఆ పార్టీకి వస్తాయని.


కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం వర్గాలు నిర్వహించిన ఎగ్టిట్ పోల్ ఈ విషయాన్ని వెల్లడిస్తోందన్నది న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సర్వేలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఏపీలో నర్సాపురం, కాకినాడ సీట్లను వైసీపీ కోల్పోతుందని చెప్పడం విశేషం. అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, కర్నూల్, నర్సారావుపేట, విజయవాడ, మచిలీపట్నం సీట్లను కూడా వైసీపీ పోగొట్టుకుంటుందని తెలుస్తోంది. 


ఇక టీడీపీ అన్ని చోట్ల టఫ్ ఫైట్ ఇచ్చిందని, ఆ పార్టీకి 65 నుంచి 70 అసెంబ్లీ సీట్లతో పాటు 10 వరకూ ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడించింది. అదే విధంగా జనసేనకు కేవలం రెండు నుంచి మూడు  అసెంబ్లీ సీట్లు మాత్రమే వస్తాయని తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే వార్ వన్ సైడ్ మాత్రం కాదని, సర్వేలు అన్నీ వూదరగొట్టినట్లుగా వైసీపీకి 130 అసెంబ్లీ సీట్లు రావని, అలాగే 22 వరకూ ఎంపీ సీట్లు అంతకంటే రావని తేలుతున్న విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి: