నిన్న ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబో లో విషాదం నెలకొంది.  ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పపడి వందల మంది ప్రాణాలు బలికొన్నారు.  విహార యాత్ర కోసం వచ్చినవారు బస చేసిన హూటళ్లను సైతం టార్గెట్ చేసుకొని ఆత్మహుతి కి పాల్పపడటంతో అక్కడ కూడా ఎంతో మంది ప్రాణాలు విడిచారు.  తాజాగా శ్రీలంకలో మరో బంబు పేలుడు  కలకలం సృష్టించింది  కొలంబోలని సెయింట్ ఆంథోనిస్ చర్చ్ దగ్గర పేలుడు.   

కొలంబో ప్రధాన బస్ స్టేషన్ దగ్గర 87 బాంబులను గుర్తించిన పోలీసులు.  పేళుళ్ల వేనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్తలు సహకరించాయంటున్నశ్రీలంక ప్రభుత్వం. ఇవాళ అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమెర్జేన్సీ.  భారీగా పేలుడు పదార్థాలు గుర్తించిన భద్రతా బలగాలు.   కొలంబో వ్యాప్తంగా విసృత తనిఖీలు నిర్వ హిస్తున్నారు. 

ఆదివారం జరిగిన బాంబు దాడులు ముమ్మాటికీ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల కుట్రగానే నిర్ధరణకు వచ్చారు. తూర్పు ప్రావిన్సుల్లో శ్రీలంక తవీజ్ జమాత్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసిన వహద్ ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నాడు. తాజా పేలుళ్లో తావీజ్ పాత్రపై స్పష్టత రాకపోయినా, పాల్పడింది ఎవరనేది విచారణలో వెల్లడవుతుందని అంటున్నారు.  కాగా కొలంబోలో మరో బాంబు పేలుడుతో అటు ప్రజలు ఇటు సైన్యం అలర్ట్ అయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: