ఈసీపై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిప‌డ్డారు. ట్విట్ట‌ర్ ద్వారా లోకేష్ స్పందించారు. చంద్రబాబు సీఎం హోదాల‌తో అధికారుల‌తో స‌మీక్ష జ‌రుపుతుంటే.. ఈసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌మేంట‌ని మండిప‌డ్డారు లోకేశ్‌. ఈ నేప‌థ్యంలో ప‌క్క రాష్ట్ర‌మైన తెలంగాణ సీఎం కేసీఆర్ స‌మీక్ష‌లు స‌మావేశాలు పెట్టుకుంటుంటే వారిపై ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు లోకేశ్‌.. అక్క‌డ వ‌ర్తించ‌ని కోడ్ ఏపీకి ఎందుకు వ‌ర్తిస్తోందని ప్ర‌శ్నించారు. ?


ఈ నేప‌థ్యంతో మంత్రి లోకేశ్ ట్విట్ పై నెటిజ‌న్లు స్పందించారు. మ‌రోసారి చిన‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు నెటిజ‌న్లు.. తెలంగాణ ఎన్నిక‌ల కోడ్‌కు.. ఏపీ ఎన్నిక‌ల కోడ్‌కు తేడా కూడా తెలియ‌దా అంటూ క‌డిగి ప‌డేస్తున్నారు. ఎందుక‌నుకుంటున్నారా.. తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఎప్పుడో అయిపోయాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వ‌చ్చిన కేసీఆర్‌.. భారీ మెజార్టీతో ప్ర‌జ‌లు మ‌ళ్లీ గెలిపించారు. సీఎంగా కేసీఆర్ ప్ర‌మాణ‌స్వీకారం కూడా చేశారు. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం జ‌రిగిన‌వి లోక్‌స‌భ ఎన్నిక‌లు మాత్ర‌మే.. ఇప్పుడు తెలంగాణ‌లో కేసీఆర్ ఫుల్ టైమ్ ముఖ్య‌మంత్రి కాబ‌ట్టి.. అక్క‌డ వారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం మార‌దు కాబ‌ట్టి అన్నీ చెల్లుతాయి. 


అయితే ఏపీలో మాత్రం అలాంటి ప‌రిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నిక‌లు, లోక్‌స‌భ ఎన్నిక‌లు రెండూ ఒకేసారి జ‌రిగాయి.. ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌ల్సి ఉంటుంది. అప్ప‌టివ‌ర‌కు ఏపీ సీఎంకు నామ‌మాత్ర‌పు అధికారం మాత్ర‌మే ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల కోడ్ కు స‌బంధించి తెలంగాణ‌కు.. ఏపీకి చాలా తేడా ఉంది. ఇది గ్ర‌హించ‌డం లేదంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.  క‌నీసం ఈ లాజిక్ కూడా తెలియ‌ని లోకేశ్‌బాబు.. ఎలా మంత్రి అయ్యారో అంటూ ట్రోల్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: