తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు సృష్టించిన గంద‌ర‌గోళం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. విద్యార్థుల త‌ర‌ఫున పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సాంకేతిక కారణాలతో తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కొన్ని చోట్ల పొరపాట్లు జరిగాయని ఆయ‌న అంగీక‌రించారు. బోర్డు పారదర్శకంగా పనిచేసి ఫలితాలు అందించిందంటూనే...90 మార్కులకు... 0 మార్కులు వేసిన ఎగ్జామినర్, స్క్రూటినీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామ‌న్నారు. నవ్య విషయంలో 9 నెంబర్ బబ్లుంగ్ చేసే బదులు 0 చేశారు అందుకే 90 మార్కుల అమ్మాయికి 0 వచ్చాయన్నారు. ఛార్జ్ మెమో కూడా ఇచ్చామ‌ని, ఫైన్ కూడా వేస్తామ‌న్నారు. అబ్సెంట్ అయిన విద్యార్థుల‌ను పాస్ అయినట్టు ఎక్కడ వేయలేదన్నారు. 


ఇక ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వ‌డంపై స్పందిస్తూ, టెండర్ ద్వారానే గ్లోబరిన సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చామ‌ని అశోక్ తెలిపారు. టెండర్ ఇవ్వడంలో కూడా..... ఎలాంటి అనుమానాలు లేవన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సమయం గడువు పెంపును పరిశీలిస్తామ‌న్నారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. స‌మాధాన ప‌త్రాలు గల్లంతు కాలేదని, అన్ని జవాబు పాత్రలు చూపిస్తామ‌న్నారు. సెంటర్లు మారడం వల్ల కొంత ఇబ్బందులు అయ్యాయని తెలిపారు. ఔట్ సోర్సింగ్ వాళ్ళతో మూల్యాంకనం  చేయించలేదన్నారు. అనుభవం ఉన్న‌ వాళ్ళతో చేయించామ‌న్నారు. 


తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మార్కులపై అనుమానాలు ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చున‌ని ఆయ‌న తెలిపారు. అధ్యాపకు లదే పొరపాటు అని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. ``. వచ్చే సంవత్సరం కాంట్రాక్ట్‌ సంస్థను మార్చి మరో సంస్థకు బాధ్యతలు అప్ప గిస్తాము. బెస్ట్‌ ఆటోమేషన్‌ ఇవ్వాలన్న లక్ష్యంతోనే సదురు సంస్థకు కాంట్రాక్ట్‌ ఇచ్చాం. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతనే గ్లోబరీనాకు కాంట్రాక్టు అప్పగించాం.`` అని  అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: