ఎంతో మంది ఉత్కంఠగా ఎదిరి చూస్తున్న బెయిల్ జగన్ కు ఎట్టకేలకు లభించింది. దాదాపు 16 నెలల జైలు జీవితానికి తెరపడింది. ఇలాంటి మధురక్షణాలకోసం ఉదయం నుంచి కోర్టు వద్ద పడిగాపులు కాస్తున్న జగన్ అభిమానులు, వైఎస్సార్ సిపి నాయకులు కోర్టు ఎదుట పండగ చేసారు. ఆనందంతో కేరింతలు వేసారు.

ఉదయం నుంచి సిబిఐ వాదనలు చూస్తే ఆయనకు బెయిల్ వస్తుందన్న సంకేతాలు కనిపించాయి. జగన్ కు సంబందించిన విషయంలో ఆయనపై హైకోర్టు సూచించిన పది అంశాలపై విచారణ పూర్తి చేసామని సిబిఐ కోర్టుకు తెలిపింది. పది కేసుల్లో క్విడ్ ప్రో కు సంబందించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని సిబిఐ స్పష్టం చేసింది. దీంతో ఆయన కేసులు కూడా దాదాపు డీలా పడ్డాయి అన్న సంకేతాలు జారీ అయ్యాయి.

కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసారు. రెండు లక్షల పూచికత్తు, ఇద్దరి ష్యూరిటీతో  బెయిల్ ఇచ్చారు. సాక్షులను ప్రభావితం చేయవద్దన్నారు, చేస్తే బెయిల్ రద్దు చేస్తామన్న కండీషన్ బెట్టారు. అలాగే హైదరాబాద్ వదిలి వెల్లవద్దని కండీషన్ బెట్టారు. సాక్షులతో మాట్లాడవద్దన్నారు, హైదరాబాద్ దాటి వెల్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని షరతు విధించారు.


జైలులో జగన్...


జగన్ బెయిల్ చిచ్చు పెట్టిందా...


జగన్ బెయిల్ తో తెలంగాణకు విముక్తి


జగన్ కేసు.. సీబీఐ శీలం...


జగన్ బెయిల్ కు బాబు ఎన్డీయేతో కలుస్తాననటమే కారణమా?


జగన్.. మళ్లీ ఓదార్పేనా? కొత్త బాట పడతాడా?


జగనన్న వచ్చేసాడోచ్ - గంతులేసిన అభిమాన గనం


జైలు అనుభవాల గురించి ఎలా స్పందిస్తాడో!


జగన్ కు అగ్ని పరీక్ష



మరింత సమాచారం తెలుసుకోండి: