రాజ‌కీయ‌మంటే ఓ చ‌ద‌రంగం.. ఎప్ప‌టిక‌ప్పుడు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకెళ్ల‌డం రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే. గెలిచి ప‌ద‌వి ద‌క్కినా అధికారంలో లేకుంటే లనేత‌ల్లో నిరాశే ఉండి తీరుతుంది. దీంతో అధికార‌పార్టీ వైపు మొగ్గుచూపుతారు. తెలంగాణ ఇచ్చిన అధికారానికి దూర‌మైన కాంగ్రెస్ పార్టీలో వ‌ల‌స‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. 


రాజ‌కీయ‌మంటే ప్ర‌జా సేవ‌. రాజ‌కీయ‌మంటే నిత్యం జ‌నం మ‌ధ్య ఉండ‌టం. ఎప్పుడూ ఓ వులుగు వెల‌గాల‌ని అనుకోవ‌డం నాయ‌కుల స‌హ‌జ దోర‌ణి. అయితే ప్ర‌జా ఆధ‌ర‌ణ ఉండి. ఎన్నిక‌ల్లో గెలిచినా ప్ర‌భుత్వంలో లేక‌పోతే నేత‌ల్లో ఉండే ఆ వెలితేవేరు. ఇక అధికారంలో ఉన్న పార్టీలోకి నేత‌లు క్యూక‌ట్ట‌డం ప‌రిపాటి. చిన్నా చిత‌క నేత‌లు కార్య‌క‌ర్త‌లు సైతం వారితోనే ఉంటారు. రాజ‌కీయాల్లో ఇది స‌హ‌జ‌మే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అచ్చం ఇలానే జ‌రుగుతోంది.

పార్టీ అధికారంలో ఉండ‌గా గాంధీ భ‌వ‌న్‌లో ప్ర‌భుత్వంలో ఒక‌ప్పుడు వెలుగు వెలిగిన నేత‌లంతా ఇప్పుడు క‌నిపించడం లేదు. భ‌విష్య‌త్‌పై భ‌రోసా లేక‌పోవ‌డమో.. లేక అధికారంపై ఆస‌క్తో తెలియ‌దు కానీ ఎవ‌రికివారు బంగారు తెలంగాణ బాట ప‌ట్టారు.  తెలంగాణ ఇచ్చిన రెండు సార్లు జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్ర ప్ర‌జ‌లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు.

దీంతో కాంగ్రెస్‌లో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న వారు సైతం గులాబీ గూటికి చేరారు. చెవెళ్ల చెళ్ల‌మ్మ‌, మాజీ హోమంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రేగా కాంతారావు, ఆత్రం స‌క్కు, స‌హా ప‌లువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. వారి బాట‌లోనే మాజీ ఎమ్మెల్యేలు ప్ర‌తాప్‌రెడ్డి, కేఎస్ ర‌త్నం, ఇత‌ర నేత‌లు కూడా పార్టీ మారిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: