దేశ‌మంత‌టా లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లోక్‌స‌భ‌తో పాటు అసెంబ్లీల‌కు కూడా ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయితే త‌మిళ‌నాడు ప‌రిస్థితి విచిత్రంగా ఉంది. ఇక్క‌డ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు ఖాళీగా ఉన్న 18 అసెంబ్లీ సీట్ల‌కు కూడా ఉప ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారు. 


జ‌య‌లలిత మ‌ర‌ణంతో అధికార అన్నాడీఎంకే చిక్కుల్లో ప‌డింది. జ‌య స‌న్నిహితురాలు జైలుపాలు కావ‌డం.. ఆమె మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్ పార్టీని వీడ‌టంతో ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వం తీవ్ర ఒడిదుడుకుకు గురైంది. దిన‌క‌ర‌న్కు మ‌ద్ద‌తు ఇచ్చిన 18 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వడింది. దీంతో ఖాళీగా ఉన్న ఈ స్థానాల‌కు కూడా ఎన్నిక‌లు జ‌రుపుతున్నారు .


త‌మిళ‌నాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. అన‌ర్హ‌త వేటు ప‌డిన సీట్ల‌తో పాటు ఖాళీగా న్న మ‌రో సీట్ల‌ను తీస్తే.. 231 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇందులో అన్నాడీఎంకేకు 114 మంది మాత్ర‌మే ఉన్నారు. డీఎంకేకు 98 మంది స‌భ్యులు, ఒక ఇండిపెండెంట్ క్యాండెట్ ఉన్నారు. ప్ర‌భుత్వానికి కావాల్సిన మేజిక్ ఫిగ‌ర్ 118  జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకే పార్టీ బ‌ల‌హీన ప‌డింద‌ని చెప్ప‌క త‌ప‌ప్దు.

కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం ఎప్పుడో కూలిపోయింది. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ సీట్ల‌కు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లు ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వానికి స‌వాలుగా మారాయి. ప్ర‌తిప‌క్ష డీఎంకే గ‌ణ‌నీయంగా పుంజుకోవ‌డం ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. 


ఇక అన్నాడీఎంకే ప్ర‌భుత్వానికి అతిపెద్ద స‌వాలు దిన‌క‌ర‌న్ నుంచి ఎదురుకానుంది. అధికార పార్టీ ఓట్ల‌ను ఆయ‌న స్థాపించిన కొత్త పార్టీ గ‌ణ‌నీయంగా చీల్చే అవ‌కాశం ఉంది. ఎలా చూసినా ఫ‌లితాలు స్టాలిన్‌కు అనుకూలంగా ఉంటాయ‌నే భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: