రాష్ట్రంలో తిరిగి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని అనేక క‌లలు కన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆశ‌లు ఎలా ఉన్నా.. నియోజ‌క‌వ‌ర్గాల‌లో.. క్షేత్ర స్థా యిలో టీడీపీ నాయ‌కుల అతి విశ్వాసం కొంత ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణాన్ని మాత్రం సృష్టించింద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. అయితే, ఎవ‌రిది గెలుపు? ఎవ‌రిది ఓట‌మి? అని చెప్పే సాహ‌సం ఏఒక్క‌రూ చేయ‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. చంద్ర‌బాబు వ్యూ హమే! అయితే, పైకి మాత్రం టీడీపీ నాయ‌కులు ధీమా వ్య‌క్తం చేస్తున్నా.. లోలోన మాత్రం తీవ్ర ౠవేద‌న, సంశ‌యం వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. వా స్త‌వానికి ఏ ఎన్నిక‌ల్లో అయినా డ‌బ్బు ప్ర‌భావం చూపుతుంది. అయితే, చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఎన్నిక‌ల‌కు ముందుగానే అధికారికంగా ప‌సు పు-కుంకుమ పేరుతో డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రూ.10 వేల చొప్పున డ‌బ్బును పంచారు. 


ఎన్నిక‌ల‌కు ముందుగానే రెండు విడ‌త‌ల్లో న‌గ‌దును పంపిణీ చేసిన చంద్ర‌బాబు.. ఎన్నిక‌ల‌కు ఒక్క రోజు ముందు మ‌రింత వ్యూహాత్మ‌కంగా మ‌హిళ ల ఖాతాల్లో న‌గ‌దు ప‌డేలా వ్య‌వ‌హ‌రించారు. ఇది సామూహిక ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌ని అంటున్నారు. అయితే, ఈ అతివిశ్వాస‌మే టీడీపీ త‌మ్ముళ్లు కూడా నిర్ల‌క్ష్యం చేసేందుకు అవ‌కాశం ఇచ్చింద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఓట‌ర్ల‌కు న‌గదు పంపిణీ విష‌యంలో చంద్ర‌బాబు ఎక్క‌డా వెనుకంజ వేయ‌లేదు. అయితే, కేంద్ర నిఘా సంస్థ‌లు ఎప్ప‌టిక‌ప్పుడు దృష్టి పెట్ట‌డంతో ఆయ‌న న‌గ‌దును నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంప‌డంలో తీవ్ర జాప్యం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే ఎక్క‌డిక‌క్క‌డ అభ్య‌ర్థుల‌ను న‌గ‌దు పంపిణీ చేయాల‌ని సూచించారు. మీ ద‌గ్గ‌ర ఉన్నంత వ‌ర‌కు న‌గ‌దును పంపిణీ చేయండి.. అంటూ మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చారు. 


అయితే, ప్ర‌ధానంగా న‌గ‌దు పంపిణీ విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం అధిష్టానం నుంచి రావాల్సిన న‌గ‌దు విష‌యంలో తీవ్ర జాప్యం ఏర్ప‌డింది. దీంతో చంద్ర‌బాబు ఏ ఉద్దేశంతో త‌మ‌కు నిధులు పంప‌లేదో అర్ధం కాని అభ్య‌ర్థులు ఏదైనా ముప్పు పొంచి ఉందేమోన‌ని భావించి.. త‌మ‌కు అందిన చిన్నా చిత‌కా న‌గ‌దును కూడా పంచ‌కుండా జాప్యం చేశారు. ఈ మొత్తం ప‌రిణామం ఒక విధంగా ఉంటే. మ‌రోప‌క్క‌, ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు, అభిమానులు ఇచ్చిన న‌గ‌దును కూడా పంచ‌కుండా కొంద‌రు అభ్య‌ర్థులు ``ముందు జాగ్ర‌త్త‌`` వ‌హించార‌ని అంటున్నారు. చాలా మంది సీనియ‌ర్ నాయ‌కులు ఇలానే వ్య‌వ‌హరించార‌ని టీడీపీ నిర్వ‌హించిన పోస్ట్ మార్ట‌మ్‌లో స్ప‌ష్ట‌మైంది. 


ఇక్క‌డ నుంచి పోటీ చేసిన వృద్ధ నాయ‌కుడికి చంద్ర‌బాబు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ``మీ వ‌ద్ద ఉన్న వాటిని పంచండి. త‌ర్వాత మాట్లాడుకుందాం`` అని చెప్పారు. అయితే, ఆయ‌న మాత్రం ఖ‌ర్చుకు వెనుకాడారు. ఎలాగూ చంద్ర‌బాబు ప‌సుపు-కుంకుమ పేరుతో పంప‌కాలు చేశారు. వేసేవాళ్లు ఎలాగూ వేస్తారు!  నేనెందుకు పంచాలి! అనే ధీమా క‌న‌బ‌రిచారు. దీంతో ఇక్క‌డ వైసీపీ దూకుడు ప్ర‌త్య‌క్షంగా క‌నిపించింది. మొత్తానికి రాష్ట్రంలోని స‌గానికిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ధీమా ఫ‌లితాల‌ను తారుమారు చేస్తుందో.. ఏమో అనే బెంగ మాత్రం అభ్య‌ర్థుల‌ను వెంటాడుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: