ఏపీలో రాజకీయ పరిస్థితులు రోజుకో రకంగా మారిపోతున్నాయి. రెండు ప్రధాన పార్టీల మధ్య ఉన్న పోటీ కాస్తా  జనసేన ఎంట్రీ తో పూర్తిగా మారిపోయింది. ఏపీలో  జనసేన ఊపు చూసిన  ఎంతో మంది ఆ పార్టీలో చేరి జనసేన జెండా తరపున గెలిస్తే , ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే పవన్ కళ్యాణ్ ద్వారా తమకి మంత్రి పదవులు దక్కుతాయి ఎంతో ఆశతో పార్టీలో చేరిపోయారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఎన్నికల పోలింగ్ తరువాత సీనియర్స్ అందరూ మూకుమ్మడిగా బోరుమన్నారట. 

 Image result for jagan

పవన్ కింగ్ మేకర్ అవుతాడు కదాయని సొంత పార్టీలని విడిచి మరీ జనసేనలోకి వెళ్తే. ఇప్పుడు జనసేన పార్టీకి అంత సీన్ లే దని తేలడంతో  ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారట. దాంతో కొందరు నేతలు జనసేన నుంచీ వైసీపీలోకి జంప్ చేయడానికి సిద్దంగా ఉన్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా జనసేన పార్టీకి అత్యంత కీలకమైన వ్యక్తిగా,  సీనియర్ మోస్ట్ గా ఉన్న ఓ నేత , ఆర్ధికంగా కూడా జనసేనకి అండగా నిలిచినా ఓ నాయకుడు త్వరలో  వైసీపీ చెంతకి చేరనున్నారనే టాక్ బలంగా  వినిపిస్తోంది.

 Related image

గతంలో వైసీపీ నుంచీ పోటీ చేసిన అయన ఘోరమైన పరాభవం ఎదుర్కోవడంతో ఈ సారి పవన్ కళ్యాణ్ జనసేన నుంచీ పోటీ చేశారు. అయితే ఈ సారి కూడా ఆయన అదృష్టం బాలేదని తేలడంతో జనసేనలో గెలిచినా ఓడినా రాజకీయంగా ఎదుగుదల ఉండాలంటే మళ్ళీ సొంత గూటికే చేరాలని నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. దాంతో జగన్ మోహన్ రెడ్డి కి టచ్ లో కూడా ఆయన ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడే వైసీపీలో చేరాలా లేక ఎన్నికల రిజల్స్ వచ్చాక వైసీపీలోకి వెళ్ళాలా అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: