ఏపీ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు.. సీఎస్ పునేఠా బదిలీ చేయడం కలకలం రేపింది. మా సీఎస్‌ ను మీరు ఎలా బదిలీ చేస్తారు అంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జోరుగా విమర్శలు గుప్పించారు. అయితే అప్పట్లో ఇందుకు వినిపించిన కారణం ఒకటి.. ఇప్పుడు వినిపిస్తున్నది మరొకటి. 


సీఎస్ బదిలీకి ముందు.. ఇంటలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు ఐపీఎస్‌లను ఈసీ బదిలీ చేసింది. ఆ బదిలీలను అడ్డుకునేందుకు సీఎస్ ప్రయత్నించారు. ఈసీ ఉత్తర్వులకు మినహాయింపు ఇస్తూ సీఎస్ పునేఠా జీవో ఇచ్చారు. ఆ తర్వాత కోర్టుకూ వెళ్లారు.. అడ్డగోలుగా జీవోలు ఇవ్వడం.. కోర్టుకు వెళ్లడం..ఎన్నికల సంఘంపై అప్పీలుకు వెళ్లడం.. వంటి కారణాలతో పునేఠాను బదిలీ చేశారని అంతా అనుకున్నారు. 

కానీ అసలు కథ వేరే ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ జీవో ఇచ్చినా ఈసీకి చెప్పాల్సి ఉంటుంది. ఈ సీ అనుమతి తర్వాతే జీవోలు ఇవ్వాల్సిఉంటుంది. కానీ.. పసుపు కుంకుమ సొమ్ములు విడుదల చేసేందుకు.. వచ్చే నెల జీతాల సొమ్ములో నుంచి అడ్జస్ట్ చేసేందుకు జీవోలు ఇవ్వాలని.. కొన్ని కాంట్రాక్టుల బిల్లుల  విడుదల కోసం కూడా  జీవోలు ఇవ్వాలని పునేఠాను  సర్కారు పెద్దలు ఆదేశించారట. 

పునేఠా ఈ జీవోలు  సిద్ధం చేయడం ఆ విషయం ఎన్నికల సంఘం వరకూ వెళ్లడం వల్లనే పునేఠాను బదిలీ చేశారని ఇప్పుడు ఢిల్లీ సర్కిల్లో.. అమరావతి సర్కిల్లో వార్తలు వస్తున్నాయి. మరి అసలు వాస్తవం ఏంటో ఎవరూ వెల్లడించే అవకాశం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: