ఏపీలో ఇప్పుడు ఎవ‌రి నోట విన్నా కూడా ఫ్యాన్ అనే మాటే వినిపిస్తోంది. ఎన్నిక‌లు ముగిసి ప‌దిరోజుల‌కు పైగానే గ‌డిచి పోయిన నేప‌థ్యంలో రాష్ట్రంలో అత్యంత ఆస‌క్తిక‌ర అంశం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఏ ఇద్ద‌రు క‌లిసినా.. ఫ‌లితంపైనే చ‌ర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లాల వారీగాను, నియోజ‌వ‌క‌ర్గాల వారీగాను, సిట్టింగ్ ఎమ్మెల్యేల బ‌లాబ‌లాలు, వారి గెలుపు ఓట‌ములు ఇలా అనేక అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఆయా ఈక్వేష‌న్ల‌పైనే చ‌ర్చిస్తున్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో అత్యంత ట‌ఫ్‌గా ఉండే స్థానాలు కేవ‌లం 50 మాత్ర‌మేన‌ని, మిగిలిన అంత ట‌ఫ్ ఫైట్ ఉండ‌ద‌ని చెబుతున్నారు. 


ఈ సంద‌ర్భంలోనే గ‌త 2014 ఎన్నిక‌ల  స‌మ‌యానికి ఉన్న ప‌రిస్థితిని తెర‌మీదికి తెస్తున్నారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో కొత్త‌గా విభ‌జించ‌బడిన రాష్ట్రం, పైగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు బీజేపీ, జ‌న‌సేన‌ల‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో అటు ప‌వ‌న్‌, ఇటు మోడీ కూడా ఏపీకి వ‌చ్చారు. చంద్ర‌బాబుకు ప‌ట్టం క‌ట్టాల‌ని, విజ‌న్ ఉన్న నాయ‌కుడ‌ని ప్ర‌చారం చేశారు. ఈ జోరు ప్ర‌చారంలో.. వైసీపీ ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. అంద‌రూ అనుకున్న‌ట్టుగా చివురుటాకులా వ‌ణికి పోలేదు. అనేక ఆటుపోట్ల‌ను త‌ట్టుకుని వైసీపీ నిల‌బ‌డింది. అనేక సంద‌ర్భాల్లో ఎదురైన అడ్డంకుల‌ను అధిగ‌మించి దూసుకుపోయింది. 


నిజానికి అంత ఉధృత‌మైన పోరు జ‌రిగిన‌ప్పుడే జ‌గ‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శించి విజ‌యం సాధించారు. మ‌రి ఇప్పుడు ఎవ‌రికి వారుగా జ‌రిగిన ఎన్నిక‌లు.. పైగా అనేక విష‌యాల్లో ప్ర‌జ‌లు నిర్ణ‌యాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించేందుకు సిద్ధంగా ఉండ‌డం వంటి ప‌లు కార‌ణాల నేప‌థ్యంలో వైసీపీ దూకుడు పెరిగింద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఆన్‌లైన్ స‌ర్వేల్లో గ‌తంలో ప్ర‌జ‌లు మీరు ఎవ‌రికి ఓటేశారు అనే ప్ర‌శ్న‌కు భ‌య‌ప‌డేవారు స‌మాధానం చెప్పేందుకు జంకేవారు. కానీ, ఈ తాజా ఎన్ని క‌ల‌కు సంబంధించి వారు ఎవ‌రికి ఓటేశార‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు, ``అంద‌రూ అనుకుంటున్నా రు..`` అనే వ్యాఖ్య‌లు ప్ర‌తి ఒక్క‌రి నోటి నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలో మార్పుతో పాటు ప్ర‌జ‌ల ఆలోచ‌నా ప‌రిణితి కూడా మారింద‌ని అంటున్నారు. మొత్తంమీద రాష్ట్రంలో మార్పు ఖాయ‌మ‌నేరేంజ్‌లో వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: