ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎన్నికల సంఘం ఆలోచిస్తోందా.. మే 2-5 తేదీల మధ్య ఏపిలో గవర్నర్ పాలన విధిస్తారా.. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి.


ఈ వార్తల సమాచారం ప్రకారం.. రేపో మాపో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి  ఏపి సిఎం చంద్రబాబుకి ఎన్నికల కోడ్ ఉల్లంఘన నోటీసులు జారీ అవుతాయట. నిర్ణీత గడువులోపల జవాబివ్వాలని అడుగుతారట. దాంతో  గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయక తప్పక పోవచ్చట.

ఒకవేళ చంద్రబాబు రాజీనామా చేయకపోతే.. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు గవర్నర్ బర్తరఫ్ ఉత్తర్వులు జారీ చేయవచ్చట. రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పకుండా ముందస్తు చర్యలు తీసుకుంటారట. ఢిల్లీ నుంచి పారా మిలిటరీ దళాల తరలింపు సన్నాహల సంకేతాలు కూడా ఉన్నాయట. 

రాష్ట్రపతి పాలన తర్వాత గవర్నర్ పర్యవేక్షణలో ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమం జరుగుతుందట. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు అన్ని పరిణామాలు ఉంటాయని ఈ సందేశం చెబుతోంది. మరి ఇది ఎంతవరకూ నిజం అన్నది అర్థం కాని విషయం. ఈసీ పై అనుచితంగా ప్రవర్తించినందుకు ఏకంగా రాష్ట్రపతి పాలన విధిస్తారా అన్నది సందేహాస్పదమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: