వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. నేటినుండి వేసవి విడిది కోసం వైఎస్ జగన్ విదేశాలకు వెళుతున్నారు.  ఈ నేపథ్యంలో ఆయన లోటస్ పాండ్ నుంచి బయలు దేరి వెళ్లారు.  ఐదు రోజుల పాట స్విస్‌లోనే టూర్ ఎంజాయ్ చేయనున్నారు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హోరు జోరుగా కొనసాగింది.  మూడు నెలల ముందు నుంచే ఏపిలో ఎన్నికల హడావుడి మొదలు కాగా గత రెండు వారాల నుంచి పోలింగ్ అయ్యే వరకు అధికార పార్టీ నేతలు ప్రచారాలు కొనసాగించారు. 


గత ఏడాది వైసీపీ నేత జగన్ ‘ప్రజా సంకల్పయాత్ర’ మొదలు పెట్టి ప్రజల్లొకి వెళ్లారు..వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. నేను విన్నాను..నేను ఉన్నాను అనే కాన్సెప్ట్ తో ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు.  మొన్న జరిగిన పోలింగ్ లో ఎక్కువగా వైసీపీ కే ప్రాధాన్యత ఇచ్చినట్లు సర్వేలు వెల్లడించాయి.  అయితే మొన్నటి వరకు ఎన్నికల హడావుడి నేపథ్యంలో జగన్ ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోలేదు.  ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో  విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు.  ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముగిశాయి.


ప్రజలు తమ అభిప్రాయాలను ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తం చేసేశారు. ఎన్నికల్లో గెలుపెవరిదో తెలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే మరి. ఐదు రోజుల పాట స్విస్‌లోనే టూర్ ఎంజాయ్ చేయనున్నారు. ఈ నెల 27న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు వైసీపీ అధినేత. కోర్టు అనుమతితో ఆయన స్విస్ పర్యటనకు వెళుతున్నారు. జగన్ గతేడాది కూడా వేసవి విడిది కోసం కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: