Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 9:55 am IST

Menu &Sections

Search

ఏమి నారాయణ - శ్రీ చైతన్య.. విధ్యాసంస్థలు రా బాబు : సగటు తెలుగోని ఘోస ?

ఏమి నారాయణ - శ్రీ చైతన్య.. విధ్యాసంస్థలు రా బాబు : సగటు తెలుగోని ఘోస ?
ఏమి నారాయణ - శ్రీ చైతన్య.. విధ్యాసంస్థలు రా బాబు : సగటు తెలుగోని ఘోస ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చదువు అంటె అది ఏదో శ్రీ చైతన్య..నారాయణ లో చదివితే తప్పా.. మిగతావి ఏవి చదువులు కావు.. అన్నట్లుగా అనుకుంటూ పిల్లలని బానిసలుగా చుస్థున్నారు.  ఇంటర్ పలితాలు వచ్చినప్పుడల్లా ఒక 10మంది చనిపోవడం ఎక్కడైనా ఉందా ..? అదో విధ్యావ్యవస్థ నా..? శ్రీ చైతన్య నారాయణ లలో చదివిన ఎంత మంది పిల్లలు గొప్పవారు అయ్యారు..? వేల మంది శ్రీ చైతన్య నారాయణ నుండి బయటకు వస్తున్నారు.. మరి వారిలొ సమాజంలొ సెటిల్ అయినవారు ఎంత మంది...? ఒక చదువు చనిపోయేలా చేసింది అంటె ఆ పిల్లలు మానసీకంగా దృడంగా ఉన్నాట్లా...?

జైలులో కంటే హీనంగా ఒకే గదిలో వేసి ఇరుకుగా ఉండి గాలి కూడా సరిగా లేని గదులలో  చదువులా... ? పిల్లలు వారి మానసీకబలం ఎంత ..? వారికి వేసే Burden ఎంత..? ఒకరు బాత్రూంకి వెళితే, మిగతా వారు వాడు వచ్చే దాకా వెయిట్ చెయ్యాలి.. ఒకవేళ ఎమర్జెన్సీ ఐతే ఇక వాడికి నరకమే...10మందికి 20మందికి   ఒకటే బాత్రూం..మొదటి వాడు వెళ్లి వచ్చే లోపల ఈలోపు క్లాస్ టైం tuition టైం ఐతే వాడు అన్ని మూసుకొని వెళ్లాలి.


లక్షల కడుతూ కనీసము ఏ మాత్రం సౌకర్యంగా లేని హాస్టల్ లొ వేసి ఉదయం నుండి రాత్రి వరకు నీకు మంచి Rank వస్తేనే జీవితం లేకపోతే బ్రతుకు దేనికి పనికి రాకుండా పోతారు.. అనే విధంగా చేస్తూనారు. ఎంత మంది నారయణ చైతన్య లొ చధివి గొప్ప వారూ అయ్యారు..? అబ్రహం లింకన్... వాజపేయి.. మోడి.. అజిమ్ ప్రేంజీ... సుందర్ పిచాయ్....సత్య నాదెల్ల..శివ నాడార్.. విరంతా ఏ శ్రీ చైతన్య.. నారాయణ లలో చదివివారు కాదు.


నారాయణ..చైతన్య లలో వేలల్లో విద్యార్ధులు ఉంటే కేవలం ఒక 100మందికి Rank లు వచ్చాయి అని ప్రచారం publicity చేస్తారు.. మరి మిగతా వారు అక్కడే చదివిన వారు కదా వారికి రాలేదే. వాళ్ల బోడి Publicity కి మీ పిల్లలనే ఉపయోగించుకుంటాడు. మీ డబ్బులతో వాళ్లు వేల కోట్లు సంపాదించుకొని  కనీసం పిల్లలకి సరైన వసతులు కూడా సరిగా ఇవ్వరు...మీ పిల్లలు టాలెంటెడ్ అయితేే గదిలో రాత్రింబవళ్లు మానసికంగా ఒత్తిడి పెట్టి మరి వారి లాభం చుసుకునే పనికిమాలిన విద్యాసంస్థలు ఇవి..ఆ విద్యాసంస్థల్లో చదివిన వారు ఎవ్వరు బయట సమాజంలో ఏ పనికి పనికిరారు.. వస్తే ఇంజనీరింగ్లో Job రావాలి లేకుంటే లేెదు అంతే..ఆత్మహత్య లతో చనిపొయే వారిలో నారాయణ చైతన్య పిల్లలే ఎక్కువ... అంత మానసికంగా ఇబ్బంది పెడితే చాల లేత పిల్లలు చాలా నరకం అనుభవిస్తారు.


ఒక ఎడంతస్తూల  బిల్డింగ్ నుండి దూకి చనిపోయే అంత మానసీక ఒత్తిడి అంటె అది ఎలాంటి ఒత్తిడో తెలుసుకోండి..కేవలం మి అభిప్రాయాలే కాదు పిల్లలకి ఇష్టమైన గ్రూప్ లు చదివే స్వేచ్చ ఇవ్వండి.. కేవలం చైతన్య నారాయణ లో ఉన్న ఒక్క MPC..BiPC..లే కాదు సమాజంలో ఎదగడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి అని చెప్పండి...కలెక్టర్ లు ..MRO లు...RDO...లాయర్ లు... వ్యాపారవేత్తలు....Judge లు ...వీరు ఎవ్వరు చైతన్య నారాయణ లో చదవి అలా కాలేదూ..చైతన్య నారాయణలొ చదివితే డబ్బు ఇల్లు వళ్ళు గుళ్ల తప్పా ఏమి లేెదు.


చివరకి బజ్జీ బండి వాడు పాని పూరి వాడు కూడా నెలకు 30000రూపాయలు కష్టపడి సంపాదనతో సంతోషం గా ఉన్నాడు...తల్లితండ్రులు చదువు అంటే ఇష్టం ఉన్న లేకున్నా చైతన్య నారాయణ లో మాత్రమే  అనే దాని నుండి బయటకు రండి.. ఒకప్పుడు  ఇంజనీరింగ్ సీట్ లు లేక పోటీ.. ఇవాళ లక్షల సీట్ లు ఉన్నాయి.. అనవసరంగా పిల్లలని బాగుకోసమే చెస్తున్నాం అనుకొని ఒక నరకపు కుపం లోకి వారిని నెట్టకండి.


"Ban Corporate Education".      అంటున్నారు తెలుగు ప్రజ .


inter-mediate-naraya-sri-chaitanya-students-hostel
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.