ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎన్నికల ఫలితాలకు ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో ఎవరికి వారు విహార యాత్రల్లో సేద తీరుతున్నారు. ఇప్పటికే ఎన్నికలు ముగిసి పది రోజులు గడిచినా... ఇంకా ఫలితాలకు నెల రోజుల సమయం ఉండడంతో పోటీ చేసిన అభ్యర్థులకు, బెట్టింగ్‌ రాయుళ్లకు క్షణం ఒక యుగంగా గడుస్తున్నట్టుగా ఉంది. ఓటరు నాడి ఎవ్వరికి స్పష్టంగా అంతుచిక్కడం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ నియోజకవర్గంలో ఎవరు ? గెలుస్తారన్నది ఎవరూ ఖ‌చ్చితంగా అంచనాకు రాలేకపోతున్నారు. పైకి ఎవరికి వారు గెలుపు తమదే అని మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నా ఎవరికి వారికి ఆందోళన ఉండడం సహజం. ఇక ఎవరి అంచనాలు ఎలా ఉన్నా పలు జాతీయ మీడియా సంస్థలతో పాటు ఏపీలో పలు ఏజెన్సీలు సైతం వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయి. మరికొందరు హోరాహోరీ పోరులో స్వల్ప ఎడ్జ్ వైసీపీకే ఉందని అంటున్నారు. వాస్తవంగా చూస్తే ఎన్నికల పర్వం ప్రారంభం కావడానికి ముందు వైసిపికి పూర్తిగా ఆధిక్యం ఉంది. 

Related image

ఏపీలో వైసీపీ గెలిచే మరోసారి అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. టిడిపి జగన్ కు ఏ మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదన్న వాతావరణం కూడా కనిపించింది. అయితే చివరిలో చంద్రబాబు పసుపు - కుంకుమతో పాటు పలు ఆకర్షణీయ పథకాల ద్వారా ఓటర్ల అకౌంట్‌లోకి నేరుగా డబ్బులు జమ చేయడంతో కొంత మార్పు అయితే కనపడింది. అయితే ఈ మార్పు జగన్ అధికారంలోకి వచ్చేందుకు ఏమాత్రం అడ్డు కాదన్నది పోలింగ్ సరళి చెప్పేసింది.  ఒక వేళ వైసిపి అధినేత వైఎస్ జగన్ స్వల్ప ఎడ్జ్‌తో అధికారంలోకి వచ్చే నేపథ్యంలో  చంద్రబాబు పెద్ద ఎత్తున కుట్రకు తెర తీస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలను ప్రయోగాల ద్వారా తమ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు టీం అప్పుడే చాపకింద నీరులా ప్రయత్నాలు ప్రారంభించేసింది.  వైసీపీలో గెలిచే ఎమ్మెల్యేలలో  ఎవరిని ? ఎలాంటి ప్ర‌లోభాలు ద్వారా లొంగదీసుకోవాలని అంచనా వేసేందుకు అప్పుడే టిడిపిలో ఒకటి కూడా రెడీ అయిందట. ఇందుకు చంద్రబాబుకు చెక్క భజన చేసే ఒక తోక మీడియా అధిపతి కూడా  బాగా సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. 


చంద్రబాబు అధికారం కోసం ఎలాంటి కుయుక్తులు అయినా పొందుతారన్నది ఆయన రాజకీయ జీవిత చరిత్ర చూస్తేనే తెలుస్తోంది. ఈ విషయంలో జగన్ ముందునుంచే చాలా ఎలర్ట్‌గా ఉండడంతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులు చేజారకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ మేధావులు, విశ్లేషకులు సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన 67 మంది ఎమ్మెల్యేలలో చంద్రబాబు 23 మందిని బలవంతంగా తమ పార్టీలోకి లాక్కున్న‌ సంగతి తెలిసిందే. ఎంత విచిత్రం అంటే టీడీపీ నుంచి గెలిచిన వారికి కాకుండా వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించి టిడిపిలోకి వెళ్ళిన వారికి పెద్దపీట వేస్తూ మంత్రి పదవులు కట్టబెట్టారు. రేపటి ఎన్నికల్లో టిడిపికి 10 నుంచి 15 సీట్లు తగ్గితే వైసీపీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలపై వలవేసి, వారికి పదవులు, డబ్బు ఎర చూపి వారిని తనవైపుకు తిప్పుకుని మళ్ళీ సీఎం పీఠం ఎక్కేందుకు చంద్రబాబు అప్పుడే కుట్ర రాజకీయాలకు తెర తీసేశారట.  ఈ విష‌యం టీడీపీ వ‌ర్గాల ద్వారానే ఆ నోటా ఈ నోటా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

Related image

ఈ విషయాన్ని ఇప్పటికే పసిగట్టిన వైసీపీ వర్గాలు చాలా అయ్యాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు లోక్‌స‌భ‌ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌ల‌ను జగన్ ఇప్పటికే నియమించారు. వారంతా తమ లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలో గెలిచే ఎమ్మెల్యేలు చేజారకుండా పక్కా ప్లానింగ్ తో రాజకీయం నడుపుతున్నారు. ఎన్నికల రోజున కౌంటింగ్ అవగానే రిటర్నింగ్ అధికారి నుంచి సర్టిఫికెట్లు తీసుకొని వారంతా ఒకే చోటకు చేరేలా ఇప్పటికే వైసిపి స్కెచ్ వేసేసింది. ఏదేమైనా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇలా ఎన్నో అడ్డదారులు తొక్కుతుండ‌డాన్ని ప్రజాస్వామ్య వాదులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. మ‌రి ప‌దే ప‌దే తాను 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకునే చంద్ర‌బాబు ఇలా దిగజారుడు రాజ‌కీయాలు చేయ‌డం ఎంత వ‌ర‌కు కరెక్ట్ ? అన్న ప్ర‌శ్న‌కు ఏమ‌ని ఆన్స‌ర్ చేస్తారో..?


మరింత సమాచారం తెలుసుకోండి: