తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చే షాక్‌ల‌ను ఊహించి కాంగ్రెస్ పార్టీ కీల‌క నిర్ణ‌యం నిర్ణ‌యం తీసుకుంది. కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా...శాసనసభాపక్షాన్ని విలీనం చేయటానికి 13 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇప్పటివరకు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరటానికి సుముఖత వ్యక్తంచేశారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వారు చేరగానే విలీన ప్రక్రియ మొదలవుతుందని అంటున్నారు.


త్వరలోనే కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం కానున్నదని సమాచారం. సీఎల్పీని త్వరలోనే టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయనున్నట్టు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన శాసనసభ్యులు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలకు, తమకు విశ్వాసం లేదని, కేసీఆర్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నామని వారు చెప్పారు. 


ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. విలీనం అడ్డుకునేందుకు స‌న్నాహాలు చేస్తోంది. బాన్స్‌వాడాలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ..ఆయన నివాసంలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ క‌లిశారు. తాజాగా పార్టీ పిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చారు.సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసే విధంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమ‌ని స్పీకర్‌కు నేతలు వివరించారు. ఇప్పటికే ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు సీఎల్పీ పిర్యాదు చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: