చంద్రబాబు .. ఈవీఎంల గురించి రాద్ధాంతం చేయడం చివరికి పార్టీ నాయకులకు నచ్చడం లేదంటా. ఈవీఎంల గురించి చంద్రబాబు చేస్తున్న ప్రచారం పార్టీ వర్గాల్లో అపనమ్మకాన్ని సృష్టిస్తోందని, బాబు ఓటమిని ఒప్పుకున్నారంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఎమ్మెల్యేలు చంద్రబాబుతో కుండబద్దలు కొట్టారు. అవేవీ పట్టించుకోవద్దని ఆయన సర్దిచెప్పాలని చూసినా, నేతలు మాత్రం ముందే ఎందుకు నోరుజారారంటూ బాబుని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.


ఫలితాలకు ముందే టీడీపీ ఓటమిని ఒప్పుకుందని, ఆ నెపాన్ని ఈవీఎంలపై నెడుతోందని ప్రతిపక్షాలు పరువు తీస్తున్నాయని వాపోయారు. ఒకరకంగా చంద్రబాబే దీనికి మూలకారణం అని ఆరోపించారట. దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచీ ఇదే కంప్లయింట్. బాబూ ఎందుకు నోరు విప్పావ్, బాబూ ఎందుకు తొందరపడ్డావ్, బాబూ ఎందుకు కార్యకర్తలతో మమ్మల్ని తిట్టిస్తున్నావ్.. అందరూ ఇవే ప్రశ్నలు వేసేసరికి చంద్రబాబులో అంతర్మథనం మొదలైంది. ప్రతిపక్షాల ప్రచారంతో డీలాపడొద్దని, గెలిచేది టీడీపీయేనని ఆయన నచ్చజెప్పాలని చూశారు. కానీ టీడీపీ నేతలు మాత్రం బాబు వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారట.


ఈవీఎంలు సరిగా పనిచేయనప్పుడు, సైకిల్ కి ఓటేసినా ఫ్యాన్ గుర్తుకే పడినప్పుడు.. టీడీపీ ఎలా గెలుస్తుందని చంద్రబాబుని కొందరు నిలదీశారట. అన్నీ బాగోలేదని చెబుతున్న మనమే, చివరకు టీడీపీ గెలుస్తుందంటే ప్రజలు నవ్వుతున్నారని, ఈ విషయంలో మాత్రం బాబు బాగా తొందరపడ్డారని ఆరోపిస్తున్నారు. అధికారులతో పెట్టిన సమీక్షలకు ఈసీ అభ్యంతరం చెప్పడంతో, కనీసం అభ్యర్థులతో అయినా సమీక్ష పెట్టుకుందామనుకున్న చంద్రబాబు ఈ ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: