తాంబూలాలు ఇచ్చాం ఇక తన్నుకు చావండి అన్న చందంగా ఉంది ఇప్పుడు తెలంగాణలో ఇంటర్ బోర్డు పరిస్థితి.  ఎన్నో ఆశలతో ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులకు ఘోరమైనా మార్కులు చూసి కడుపు రగిలిపోతుంది.  టాప్ ర్యాంక్ లో మార్కులొస్తాయని భావించిన విద్యార్థులకు 0, 1,2 మార్కులు రావడం చూసి షాక్ తిన్నారు..తాము నూటికి 80,90 శాతం పరీక్షలు రాస్తే..కనీసం పాస్ మార్కులు రాకపోగా సింగిల్ డిజిట్ రావడం జీర్ణించుకోలేక పోతున్నారు.  తమ పిల్లలు ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాస్తే దారుణమైన మార్కులు వేసి వారి జీవితాలతో ఆడుకుంటారా అని తల్లిదండ్రులు గత మూడు రోజుల నుంచి ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నారు. 

నిన్న ఈ విషయంపై ఇంటర్ బోర్డు కార్యదర్శి స్పందిస్తూ..తప్పు జరిగింది..అయితే ఆ తప్పు చేసిన వారిని వివరణ కోరామని..మార్కుల వాల్యూయేషన్ చేసిన వారి తప్పు అయితే తప్పకుండా శిక్షిస్తామని చెప్పారు.  అయితే ఇంటర్ ఫలితాల వ్యవహారంలో సాంకేతిక సేవలు అందించిన గ్లోబరినా ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబరినా సంస్థ అధినేత, సీఈవో వీఎస్ఎన్ రాజు స్పందించారు. తెలంగాణ బోర్డు విడుదల చేసిన ఫలితాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు.

తాము పారదర్శకంగానే వ్యవహరించామని స్పష్టం చేశారు. అంతే కాదు ఈ విషయలో ఎలాంటి విచారణ కైనా తాము సిద్దంగా ఉన్నామని  తేల్చిచెప్పారు. తాము టెండర్లు దక్కించుకోవడం వెనుక ఎలాంట రాజకీయ ఒత్తిళ్లు లేవని రాజు అన్నారు. మిగతా సంస్థల కంటే తక్కువ కోట్ చేశాం కాబట్టే టెండర్ తమకు దక్కిందని పేర్కొన్నారు.  అయితే తమపై కాకినాడ జేఎన్టీయూ పలు ఆరోపణలు చేస్తున్నారని..వారి ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవని పైగా జేఎన్టీయూ తమకు ఇంకా కోట్లాది రూపాయలు చెల్లించాలన్నారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంలో బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు సంయమనం పాటించాలని రాజు కోరారు


మరింత సమాచారం తెలుసుకోండి: