మొత్తానికి తెలంగాణా ఇంటర్ బోర్డ్ కి మొట్టికాయలు బాగానే పడుతున్నాయి. ఎక్కడ లోపం జరిగిందో తెలియదు కానీ చారిత్రాత్మకమైన దారుణం జరిగిపోయింది. ముక్కుపచ్చలారని పదహారు మంది చిన్నారులు బలి ఐపోయారు. ఎంతో భవిష్యత్తు ఉన్న భావి పౌరులు మట్టిలో కలసిపోయారు. ఈ పాపం ఎవరిది అన్న ప్రశ్నకు తేలిగ్గా జవాబు దొరకదు, అందుకే పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.


ఈ నేపధ్యంలో ఇంటర్ పాపాలపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు లో విచారణ జరిగింది. ఇంటర్ బోర్డు నిర్వాకం వల్ల పదహారు మంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.  ఏకంగా మూడు లక్షల మంది ఇంటర్ విద్యార్ధుల భవిష్యత్తు చీకట్లో నెట్టిన బోర్డ్ తీరుపై   హైకోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది. 


మూడు లక్షల మంది విద్యార్ధులు పెయిల్ అయిన తీరు, విద్యార్దులు,వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న నేపద్యంలో బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.  ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మళ్లీ రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు సూచించగా ,రెండు నెలల సమయం పడుతుందన్న అదపు ఎజి అన్నారు.అందుకు హైకోర్టు అంగీకరించలేదు.


 ఫెయిలైన 3లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాల వాల్యుయేషన్ కు అంత సమయం ఎందుకని ప్రశ్నించింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సోమవారం చెబుతామని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు.  మొత్తానికి చూసుకుంటే ఇంటర్ బోర్డ్ చేసిన అరాచకం ఇపుడు దేశవ్యాపతంగా చర్చకు వస్తోంది. ఇప్పటికైనా తప్పులు దిద్దుకుంటారా అన్నది చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: