ఏపీ ఎన్నికల తీరుపై సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పలేమంటూ తన అంచనాలు వివరించారు. చంద్రబాబు చివరి నిమిషంలో ఇచ్చిన పసుపు కుంకుమ, ఫించన్ రెట్టింపు ఓట్లు తప్పక పడతాయని ఆయన అంటున్నారు.


పేదలకు పది వేల రూపాయలు ఉచితంగా వస్తే వారు ఆ కృతజ్ఞత చూపుతారని ఉండవల్లి అంటున్నారు. పేదలు ధనవంతులంత సులభంగా మోసం చేయలేేరని.. అదే టీడీపీకి కలసిరావచ్చని ఉండవల్లి అంటున్నారు. కానీ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అభిమానిగా.. జగన్ సీఎం అయితే చూడాలని ఉందని ఉండవల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. 

అనవసరంగా ఈ ఎన్నికలపై బెట్టింగులు కాచి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఉండవల్లి సలహా ఇస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మళ్లీ రాజన్న రాజ్యం చూసే అవకాశం ఉంటుందని ఉండవల్లి అన్నారు. ఎన్నికల్లో సర్వేలు, విశ్లేషణలు ఇవి ఏవీ కూడా  నిజం కాదని ప్రజల మధ్య ఉండి వారిని దగ్గరగా చూసిన వారు మాత్రమే సరియైన ప్రజల నాడి చెప్పగలడని ఆయన అన్నారు. 

పోలీసులు జనం మధ్యనే ఉంటారు కాబట్టి వారి కదలికలు గమనిస్తే కాబోయే సీఎం ఎవరు అన్నది మనం ఊహించవచ్చునని ఆయన విశ్లేషించారు. ఒక పోలీస్ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకు సెల్యూట్ చేయడం లేదంటే ఆ పార్టీ అధికారంలోకి రాదని నిర్దరణకు రావచ్చని ఉండవల్లి అన్నారు.  పోలీసులు  ప్రజల మధ్యనే ఉంటారు కాబట్టి వారికి ఓటరు ఎవరి వైపు మొగ్గాతాడో తెలుస్తుందని ఆయన అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: