కులం కూడు పెట్టదు. మతం మాట సాయం చేయదు. ఇది అందరికీ తెలిసిందే. మనం ఇపుడు ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం. కానీ ఎంతో సాంకేతికత అభివ్రుధ్ధి చెందుతున్న ఈ రోజున  కూడా కులం అంటూ కుళ్ళుకుంటున్న వారే ఎక్కువైపోయారు. నిజానికి ఇపుడున్న వ్యవస్థలో మా కులం అనుకుంటుంటే ఎంత ఆనందమో. నిజానికి ఈ విధంగా ఓ కాస్ట్ మ్యానియాలోకి తీసుకెళ్ళి పబ్బం గడుపుకుంటున్నద్ది అచ్చంగా రాజకీయమే.


ఇదంతా ఇపుడు ఎందుకంటే గత నెల 14న రాజమహేంద్రవరంలో జనసేనాని పవన్ కళ్యాణ్  తన పార్టీ మీటింగులో మాట్లాడుతూ రెడ్డి కులస్తుల పుట్టు పూర్వోత్తరాలను కొంత తవ్వి తీశారు. ఆయన ఆనాడు అన్నది కాకతాళీయం కాదన్నది తెలిసిందే. అప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఎన్నికల సమర సభలో భాగంగా తొలి మీటింగ్ అది. రెడ్డి అంటూ గొప్పలు పోవడం కాదు అంటూ పవన్ వేసిన సెటైర్లు సూటిగా వైసీపీకే తగిలాయి. రెడ్డి అంటే ఓ కాపుదల కాసే ఉద్యోగం. అంటే అది ఒక జాబ్. అంతే తప్ప అది కులం కాదు, రాజు, రక్షకుడు అంటూ అర్ధాలు చెప్పారు పవన్. దీనికి ఆధారంగా బ్రిటిష్ వారి కాలంలో రెడ్డి అంటూ రక్షణకు నియోగించేవారంటూ  చెప్పుకొచ్చారు.



అయితే అప్పట్లో ఎందుకో పెద్దగా పట్టించుకోని వైసీపీ సోషల్ మీడియా వారు ఇపుడు తీరిగ్గా  బయటకు తీసి గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. అసలు బ్రిటిష్ వారు దేశంలోకి రాకపూర్వమే అంటే క్రీస్తు పూర్వమె రెడ్లు ఈ దేశంలో ఉన్నారని, రాజ్యాలు ఏలారని చరిత్ర వల్లె వేశారు. రెడ్లు ఎంత పాతవారు అంటే శాతవాహనులు, మౌర్యులు కాలం కంటే ముందు వారని కూడా పేర్కొన్నారు. ఇక గోన గన్నా రెడ్డి 12వ శతాబ్ధలో ముస్లింల మీద తిరగబ‌డిన చరిత్రను, వేమన్న శతకాలను ఉటంకిస్తూ ఎందరో రెడ్లు ఈ దేశంలో ఏలిన చరిత్ర‌ను తవ్వితీశారు. మొత్తానికి చరిత్ర సంగతెలా ఉన్నా ఈ కుల పంచాయతి మాత్రం సోషల్ మీడియాలో పెద్ద రచ్చగానే ఉంది. ఇది ఎవరికీ మంచిది కాదు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి వారు కుల ప్రస్తావన లేకుండా మాట్లాడితే  ఇంకా బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: