రాజకీయ నాయకులు ఓ మాట అనేసి పోతారు. దాని ఫలితాలు మాత్రం వారు ఆలోచన చేయరు. ఇపుడు చూస్తూంటే అదే జరుగుతోంది. అపుడెపుడో సినీ నటుడు కమ్  జనసేనాని పవన్ కళ్యాణ్ రెడ్ల గురించి కామెంట్స్ చేశారు. అదిపుడు పెద్ద కుల యుద్ధానికే దారి తీస్తోంది. రెడ్ల గురించి ఏం తెలుసు అంటూ కౌంటర్ల మీద కౌంటర్లేసుకుంటూ చెలరేగిపోతోంది. సోషల్ మీడియా దీంతో వేడెక్కిపోతోంది.


పవన్ కళ్యాణ్ అసలు పేరు కాదు. కొసరు పేరు. అది కూడా అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి డైరెక్టర్ దానం చేసిన పేరు అంటూ ఏకంగా పవన్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అసలు పేరు కళ్యాణ్ కుమార్. సినీ పేరు పవన్ కళ్యాణ్. సినిమాల కోసం పేరు మార్చుకున్న  పవనా రెడ్డి చరిత్ర గురించి చెప్పేది అంటూ సోషల్ మీడియాలో ఓ స్థాయిలో  రెచ్చిపోతున్నారు.


ఏ బ్రిటిష్ వాడురా రెడ్డి అని పేరు ఇచ్చేంత మొనగాడు, పవన్ చదివిన రెండు లక్షల పుస్తకాల్లో రెడ్డి చరిత్ర కనబడలేదా, పలు శతాబ్ధాల పాటు  తెలుగు నేలను పాలించిన రెడ్ల చరిత్ర తెలుసుకో తరువాత మాట్లాడు అంటూ జనసేనాని మీద కామెంట్స్  చేస్తున్నారు. తాతల నాటి మా ఫిరంగులు తుప్పు పట్టి ఉండవచ్చు కానీ తూటాల్లాంటి వారసులం ఉన్నాం అంటూ రెడ్డి యువత చేస్తున్న పోస్టింగులు ఇపుడు హోరెత్తిస్తున్నాయి. మరి చూడాలి ఈ కుల యుధ్ధం ఎంతవరకూ వెళ్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: