ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధల ఓట్ల కోసం చంద్రబాబు ఎన్నో వరాలు ప్రకటించారు. అడిగినా అడగకపోయనా వేల కోట్ల రూపాయల హామీలు గుప్పించారు. గెలుపు కోసం డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద పదివేలు రూపాయలు ఖాతాల్లో వేశారు. 


వృద్దులకు ఫించన్లు రెట్టింపు చేశారు. నిరుద్యోగ భృతి ఇచ్చారు. మరి వీటికి సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయి.. అసలే ఆంధ్రా ఖజానా పరిస్థితి అంతంత మాత్రమే.. ఇప్పుడు దీనికి సంబంధించిన కఠోరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. 

డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ ద్వారా 94 లక్షల మందికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు చెల్లించారు. రైతు రుణమాఫీ నాలుగోవిడత ఎన్నికలకు ముందు 3,300 కోట్ల రూపాయలు ఇచ్చారు. అన్నదాతా సుఖీభవ కింద  ఒక్కొక్క రైతుకు నాలుగు వేల రూపాయల చొప్పున రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించారు.

ఇలా విచ్చలవిడిగా కోట్లకు కోట్లు మంజారు చేసేశారు. వీటి కోసం ఈ నాలుగునెలల వ్యయం 77 వేల కోట్లు ఖర్చు చేశారట. వీటికోసం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 2,358 కోట్ల బిల్లులను పెండింగ్ లో పెట్టేశారు.  జీతాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. 

మూడు నెలల నుంచి అంగన్వాడీల జీతాలు పెండింగ్‌లో పెట్టేశారు. నాన్ హెచ్ ఆర్ బిల్లులు మూడు వేల ఏడువందల కోట్లు పెండిగ్‌ పెట్టారు. పంచాయతీ కార్మికులు ఖాళీ కడుపులతో పని చేస్తున్నారు. ఇలా నలభై ఏళ్ల అనుభవంతో చంద్రబాబు రాష్ట్ర ఖజానా ఖాళీ చేసారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: