ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్నవేళ మరోసారి సర్వే వెలుగు చూసింది. ఇది జర్నలిస్టులు చేసిన సర్వే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే చేయించింది మోహన్, మధు, శ్రీధర్ అంటూ పేర్కొంటున్నారు. ఈ సర్వే వివరాలు మరీ షాకింగ్ గా ఉన్నాయి. 


ఈ సర్వే విశేషం ఏమిటంటే పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా చేశారు. ఒక్కో ఎంపీ నియోజకవర్గంలో ఏపార్టీ గెలుస్తుంది.. ఏ అసెంబ్లీ సీటు ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయాలను ప్రస్తావించారు. ఓపరాల్‌ గా చూస్తే  వైసీపీ ప్రభంజనం ఏపీలో కనిపిస్తోంది. 

ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైసీపీ 131 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే చెబుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ 40 స్థానాలకే పరిమితం అవుతుందట. ఇక జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కేవలం నాలుగు సీట్లు గెలుస్తుందని ఈ సర్వే అంచనా వేస్తోంది. 

పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే వైసీపీ ప్రభంజనం చాలా ఎక్కువగా ఉంటుందట. మొత్తం 25 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 23 నుంచి 25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే అంచనా వేస్తోంది. మొత్తానికి మొత్తం ఎంపీ సీట్లు గెలిచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటోంది. మరి రాష్ట్రంలో అంత ప్రభంజనం ఉందా.. ఎన్నికల తర్వాత కానీ తెలియదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: