టీడీపీ నేతల తీరు చూస్తుంటే ప్రజలు నవ్వుకొనే పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కేమో ఈవీఎంలో పని చేయడం లేదని నానా యాగీ చేస్తారు. ఈసీ వద్దన్నా సరే మేము సమీక్షలు చేస్తామంటారు. అయితే  పచ్చ కామెర్లున్నోడికి లోకమంతా ఎలా కన్పిస్తుందోగానీ, తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం 'అధికారం' అనే అహంకారం కారణంగా వాస్తవ పరిస్థితులు అర్థం కావడంలేదు. మే 23న ఫలితం ఎలా వస్తుందన్నది వేరే విషయం.


ఒక్కసారి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందంటే, ఇక ఆ ప్రభుత్వం అటకెక్కినట్లే. ఎన్నికల ఫలితాలు వెల్లడయి, కొత్త ప్రభుత్వం వచ్చేదాకా.. ప్రస్తుత ప్రభుత్వం ఆపద్ధర్మమే అవుతుంది. 'ఆపద్ధర్మ' అన్న పదానికి రాజ్యాంగంలో సరైన నిర్వచనమే లేదనేది రాజ్యాంగ నిపుణుల మాట.. అయినాగానీ, ఎన్నికల కోడ్‌ కారణంగా వుండే ఆంక్షల్ని, అధికారంలో వున్నోళ్ళు గౌరవించకపోతే ఎలా.?  రైతుల మీద చంద్రబాబు సర్కార్‌కి ఎంత మమకారం వుందో ఐదేళ్ళలో బాగానే కన్పించింది.


ఆ రైతుల తీర్పేమిటన్నది ఆల్రెడీ ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. ఇప్పుడు కొత్తగా సోమిరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో ఓవరాక్షన్‌ చేస్తే ఎలా.! అన్నట్టు, వరుస పరాజయాలతో 'గెలుపు' అన్న విషయమే మర్చిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చంద్రబాబు మెప్పు కోసం పడ్తున్న పాట్లు చూస్తోంటే జనం నవ్వు ఆపుకోలేకపోతున్నారు.. అధికార పార్టీ నేతల తీరు చూసి, 'వీళ్ళా మన పాలకులు' అని ముక్కున వేలేసుకుంటున్నారు.  2014 ఎన్నికలు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లతోనే జరిగాయి.. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.. ఇప్పుడు అదే ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయి.. కానీ, ఇప్పుడేమో ఆ ఈవీఎంల మీద నమ్మకం లేదంటూ టీడీపీ చేస్తున్న యాగీని చూస్తూనే వున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: