జాతీయ స్థాయిలో బీజేపీ బలహీనపడుతుందని అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి పదవిపై ప్రాంతీయ పార్టీల నేతలకు ఆశలు పెరుగుతున్నాయి. అందుకే ఎవరికి వారు తమ ముందు జాగ్రత్త చర్యల్లో ఉన్నారు. అయితే ప్రధాని కావాలంటే దానికి తగినంత ఎంపీల బలం ఉండాలి. అందుకే ఎన్నికల ఫలితాలు వస్తే కానీ.. దీనిపై క్లారిటీ రాదు. 


ఈ లోపే వారు ముందుస్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల మమతా బెనర్జీ కేసీఆర్, జగన్‌ లతో టచ్‌లో ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఇవి ప్రధాని పదవి దిశగా మమత చేస్తున్న కసరత్తుగానే బావించాలి. వాస్తవానికి కేసీఆర్ మాయవతిని ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ చేయాలనుకుంటున్నారు. 

మరి ఎన్నికల ఫలితాల్లో మమత 35కు మించి సీట్లు సాధిస్తే ప్రధాని పదవికి ఆమె పోటీలో ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుంది. కాంగ్రెస్‌కు ఎలాగూ మంచి మెజారిటీ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి.. మమత, మాయావతి, కేసీఆర్, చంద్రబాబు వంటి నేతలు ప్రధాని రేసులో తమ అవకాశాలను మెరుగు పరుచుకుంటున్నారు.

ఇప్పటికే చంద్రబాబునాయుడు ఈవీఎం అంశాన్ని పట్టుకుని జాతీయ రాజకీయాల్లో ఫోకస్ అవుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది.. అన్ని ప్రాంతాల్లోనూ పర్యటలు చేస్తున్నారు. తాను ప్రధాని కాకపోయినా ప్రధాని ఎంపికలో కీలకపాత్ర పోషించాలన్నది ఆయన ప్లాన్ గా ఉంది. చూడాలి ఎవరిది పై చేయి అవుతుంది.? 



మరింత సమాచారం తెలుసుకోండి: