జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ లక్ష కోట్ల రూపాయలను దోచుకున్నాడని.  నిజానికి అంత భారీ ఎత్తున అవినీతికి పాల్పడటం సాధ్యమవుతుందా లేదా అన్న లాజిక్ ను ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్ హయాంలో కొడుకు జగన్ రాష్ట్రాన్ని దోచేసుకున్నాడని చంద్రబాబునాయుడు అండ్ కో ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలకు చంద్రబాబు మద్దతుగా నిలబడే మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వార్చి విపరీతమైన ప్రచారం కల్పించింది.

 

సరే నిజానిజాలు ఎవరిక్కావాలి ? అందుకే జగన్ లక్ష కోట్లు దోచేసుకున్నాడని ఆరోపణలే ప్రధానంగా జనాల్లో బుర్రలోకి ఎక్కిసింది.  అయితే అక్రమాస్తుల కేసులను విచారించిన జేడి లక్ష్మీనారాయణ అంటే ప్రస్తుతం జనసేన నేత లేండి. మొన్ననే విశాఖపట్నం ఎంపిగా పోటీ చేశారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అదంతా అబద్ధమని తేల్చేశారు. జగన్ లక్ష కోట్లను దోచుకున్నాడన్నది రాజకీయ పరిభాషగా ఉపయోగించుకున్నట్లు తేల్చేశారు.

 

నిజానికి జగన్ అక్రమాస్తుల కేసు మొత్తం విలువ మహా ఉంటే ఓ రూ 1500 కోట్లుండవచ్చన్నారు.  రాజకీయంగా జగన్ పై ప్రత్యర్ధులు లక్ష కోట్లు దోచుకున్నాడని ఆరోపణలతో తనకేమీ సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. అంటే తాజాగా జేడి  చేసి ప్రకటనతో చంద్రబాబు అండ్ కో, చంద్రబాబు మీడియా చేసిన ఆరోపణల్లో ఎటువంటి పసా లేదని తేలిపోయింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: