పోలింగ్ రోజు మొరాయించిన కొన్ని ఈవిఎంలపై చంద్రబాబునాయుడు పది రోజుల క్రితం పెద్ద రాద్దాంతమే చేశారు. అయితే ఓటమి భయంతోనే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నట్లు అందరికీ అర్ధమైపోయింది. ఓ నాలుగు రోజులు ఈవిఎంల మోరాయింపుపైన, ఎన్నికల కమీషన్ పనితీరు మీద గోల చేసిన చంద్రబాబు తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే, ఓటమి భయంతోనే చంద్రబాబు ఈవిఎంలపై రాద్దాంతం చేస్తున్నారంటూ టిడిపి నేతలే బాహాటంగాన వ్యాఖ్యానాలు చేశారు. దాంతో జరిగిన డ్యామేజిని కంట్రోలు చేసుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు.

 

అయితే ముంబాయ్ లో ఎస్పీపీ అభ్యర్ధులను ప్రచారానికి వెళ్ళిన చంద్రబాబు ఇదే ఈవిఎంలపై కొత్త రాగం అందుకున్నారు.  ఈ కొత్తరాగంతో  ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ను 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఫాలో అవుతున్న విషయం గుర్తించలేదు. మొన్నటి వరకూ ప్రత్యేకహోదా, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం, సంక్షేమ పథకాల ప్రకటనలో జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయిన చంద్రన్న తాజాగా పాల్ ను ఫాలో అవటంలో ఏమాత్రం  మొహమాట పడటం లేదు.

 

 

ఈవిఎంలను రష్యన్ హ్యాకర్లు హ్యాక్ చేస్తున్నారంటూ ఎప్పుడో పాల్ చేసిన ఆరోపణలనే చంద్రబాబు ముంబాయ్ అందుకున్నారు.  అప్పట్లో పాల్ చేసిన ఇదే ప్రకటనను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇపుడు అదే ప్రకటన చంద్రబాబు చేస్తే మాత్రం పచ్చ పత్రికలు విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చాయి. ముంబాయ్ లో మాట్లాడిన చంద్రబాబు ఈవిఎంల హ్యాకింగ్ గురించి మాట్లాడారే కానీ ఏపి ఎన్నికల్లో హ్యాక్ అయ్యాయా ? లేకపోతే దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా హ్యాక్ అవుతున్నాయా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

 

ఏదో అనుమానం వ్యక్తం చేయటం ప్రత్యర్ధులపై గుడ్డకాల్చి మీదేసయటం చంద్రబాబుకు బాగా అలావాటు. దానికి చంద్రబాబు మీడియా విపరీతమైన మద్దతు ఇస్తుంటుంది. ఈవిఎంల హ్యాకింగ్ కూడా ఇందులో భాగమే అనుకోవాలి. ఎందుకంటే, కోట్ల రూపాయలను ముట్టచెబితే ఈవిఎంలను హ్యాక్ చేస్తామని రష్యన్ బృందాలు తిరుగుతున్నట్లు చెప్పిన చంద్రబాబు ఆ వివరాలను కేంద్రప్రభుత్వానికి ఇచ్చారా ? లేదో తెలీదు.

 

ఇక్కడ విచిత్రమేమిటంటే చంద్రబాబు తర్వాత శరద్ పవార్ మాట్లాడుతూ ఈవిఎంల పనితీరుపై తప్ప తమ విజయంపై తమకు ఎటువంటి సందేహాలు లేవు. చంద్రబాబుతో పాటు మీడియా సమావేశంలో చాలామందే పాల్గొన్నా వారెవరూ ఈవిఎంలు, హ్యాకింగ్ పై మాట్లాడలేదు.  అంటే జాతీయ స్ధాయిలో ఈవిఎంలకు ప్రత్యామ్నాయాలపై చంద్రబాబుకు పెద్దగా మద్దతు లభిస్తున్నట్లు కనిపించటం లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: