గోరంట్ల మాధవ్.. ఏపీ పార్లమెంట్‌ ఎన్నికల్లో బాగా వినిపించిన పేరు.. అనంతపురం జిల్లాలో సీఐగా పని చేసి.. వాలంటరీ రిటైర్‌ మెంట్ తీసుకుని వైసీపీ తరపున పోటీ చేసిన బీసీ నేత గోరంట్ల మాధవ్.. ఇతన్ని పోటీ చేయకుండా చేసేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలే ఇతన్ని హీరోని చేశాయని చెప్పొచ్చు. 


సీఐగా చాలా ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నా.. అతన్ని రిలీవ్ చేయకుండా సర్కారు వేధించింది. చివరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన కోర్టుకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది. ఎందుకైనా మంచిదని ఆయన భార్యతో కూడా నామినేషన్ వేయించేందుకు సిద్దపడ్డాడు. 

కోర్టు అక్షింతలతో  సర్కారు రిలీవ్ చేయగా.. చివరకు బరిలో నిలబడ్డాడు. ఎన్నికల ప్రచారంలోనూ గోరంట్ల మాధవ్ డైనమిక్‌గా మాట్లాడారు.. తనను అణిచివేసేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిందీ ప్రధానంగా వివరించారు. చివరకు ఇప్పుడు ఆయన హిందూపురంలో ఎంపీగా గెలవబోతున్నాడని ఓ సర్వే తేల్చి చెప్పింది. 

తాజాగా వచ్చిన న్యూ ఇండియా సర్వే.. ఏపీలో వైసీపీ 18 స్థానాలు కచ్చితంగా గెలుచుకుంటుందని చెప్పింది.. ఆ జాబితాలో హిందూపురం కూడా ఉండటం విశేషం. పోటాపోటీ కూడా లేకుండా మాధవ్ గెలుపు ఖాయమేనని ఆ సర్వే చెబుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: