అయిదేళ్ళ క్రితం అడ్డగోలు విభజనతో దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పట్లో బీజేపీని పట్టుకుని బాగుపడాలని చూసింది. అయితే కేంద్రంలోని మోడీ, ఏపీలో బాబు ఇద్దరూ కలసి ప్రత్యేక హోదా సహా అనేక హామీలను పక్కన పెట్టేశారు. నాలుగేళ్ల పాటు కలసి ఉన్న ఈ రెండు పార్టీలు చివరకు విడిపోయి తమ రాజకీయం తాము చూసుకున్నారు.


ఇపుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేశాయి. ఈసారి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్నది ఆసక్తికరంగా ఉంది. ఏపీలో బాబు వచ్చినా జగన్ సీఎం ఐనా కూడా కేంద్ర సాయం పెద్దగా ఉండేది లేదన్నది తెల్సిపోఓంది. కేంద్రంలో మళ్ళీ మోడీయే వస్తే ఏపీకి గతంలో మాదిరిగానే పెద్దగా సాయం ఉండబోదని అంటున్నారు. ఇక్కడ జగన్ పవర్లోకి వచ్చినా కూడా మోడీ తన పద్ధతిలో తాను చేసుకుని పోతారని అంటున్నారు.


ఎందుకంటే ఏపీ బీజేపీ పాలిత రాష్ట్రం కాకపోవడమే ప్రధాన కారణం. ఇక కాంగ్రెస్ నేత్రుత్వంలోని మిశ్త్రమ ప్రభుత్వం వచ్చినా, లేక ప్రాంతీయ పార్టీలతో కలసి ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా కూడా ఏపీకి అసలు ఒరిగేది ఉండదని కూడా నిపుణులు అంటున్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలు  తమ సొంత ప్రయోజనం ముందు చూసుకుంటాయి.   ఏపీకి అధికంగా నిధుల సాయం చేయడాన్ని ఎవరూ వూరుకోరు. మొత్తం మీద ఏపీలో పరిస్థితి ఎన్నికల తరువాత ఇంకా ఇబ్బందికరంగానే  ఉంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: