తెలుగుదేశం పార్టీ సత్య శోధన ఇపుడు ఆ పార్టీలో ప్రకంపనలు స్రుష్టిస్తోంది. ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు కానీ పార్టీ పరిస్థితి ఏంటన్నది మెల్ల మెల్లగా తెలుస్తోంది. పోలింగ్ సరళిని బట్టి చూస్తే టీడీపీ కి జనం చుక్కలు చూపించారన్నది నిజమంటున్నారు. ఇదే విషయం ఫార్టీ యియర్స్ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియనిది కాదు. 


అందుకే ఆయన రెండు రోజుల క్రితం ఉండవల్లి ప్రజావేదిక వద్ద నిర్వహించిన పార్టీ అభ్యర్ధుల సమీక్షా సమావేశంలో నాయకుల పనితీరుని కడిగిపారేశారని టాక్. అవినీతి అట్టడుగు స్థాయికి చేరిపోవడం, పార్టీ నాయకులు ఎక్కడా సరిగా పనిచేయకుండా ఉండడం, ఎటు చూసిన నిర్లిప్తత ఇవన్నీ కలసి పార్టీని నిండా ముంచాయన్న బాధ అధినాయకత్వంలో కనిపించింది. 


దీంతో సమీక్షలో బాబు పార్టీ నాయకులకు  ఫుల్లుగా తలంటారని టాక్. ఎన్నో పధకాలు పెట్టాను, ఎంతో చేశాను, అయినా వాటిని జనంలోకి తీసుకెళ్ళలేకపోయారు. పార్టీని గట్టిపరచలేకపోయారంటూ మండిపడ్డట్టుగా తెల్సింది. ఇక వైసీపీ హామీలకు జనం ఆకర్షితులయ్యారని, కొత్తగా వచ్చిన జనసేన ఓట్లను చీల్చిందని పార్టీ నాయకులు చెబుతున్న మాటలని సైతం చంద్రబాబు పట్టించుకోలేదని ఇన్సైడ్ టాక్. మీ చేతగానితనాన్ని  మరో పార్టీ గొప్పతనంగా చెప్పకండి అంటూ క్లాసు తీసుకున్నార‌ని భోగట్టా. మొత్తానికి చూసుకుంటే టీడీపీలో  ఓటమి భయం ఇపుడు బాగానే కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: