ఆంధ్రప్రదేశ్ లో మొన్న పోలింగ్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం నియమించినందున .. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి… బరువు బాధ్యతలు కూడా తనవేనని… ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం అనుకుంటున్న విషయం తెలిసిందే.


కాగా, నేడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, డీజీపీ ఆర్పీ ఠాకూర్, హోంశాఖ కార్యదర్శి అనురాధ హాజరయ్యారు. అలాగే జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల సరళి చాలా బాగా జరిగిందని..కొన్ని చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ సవ్యంగా జరిగిందని అన్నారు.  అధికారులు తమ విధులు చక్కగా నిర్వహించారని అన్నారు.  ఇప్పుడు  కౌంటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరించాలని అన్నారు.    ఏపీ అంతటా స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పరిస్థితుల గురించి సీఎస్ సుబ్రహ్మణ్యం అధికారులను అడిగి తెలుసుకున్నారు. 


కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలనీ, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏపీలో సంక్షేమ పథకాల అమలుపై సీఎస్ సమీక్ష నిర్వహించడంపై మంత్రులు మండిపడుతున్న నేపథ్యంలో సీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: