రెండు తెలుగు రాష్ట్రాల‌ను కుదిపేస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.. ఇప్ప‌టికే 20 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన ఘోరానికి కార‌ణ‌మైన తెలంగాణ ఇంట‌ర్మీడియెట్ బోర్డు నిర్వాకం. ఇటీవ‌ల తెలంగాణ‌లో విడుద‌లైన ఇంట‌ర్ ఫ‌లితాల్లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల కార‌ణంగా బాగా చ‌దివిన ఫ‌స్ట్ క్లాస్ స్టూడెంట్లు కూడా ఫెయిల‌య్యారు. దీంతో ఈ ఆవేద‌న‌ను త‌ట్టుకో లేక దాదాపు 20 మంది ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. తీరిగ్గా దీనిపై స్పందించిన ఇంట‌ర్ బోర్డు మ‌ళ్లీ అప్ల‌యి చేసుకోండి అని విద్యార్థుల‌కు బోర్డు ఉచిత స‌ల‌హా విసిరింది. అయితే, ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఇలా ల‌క్ష‌ల మంది విద్యార్థుల జీవితా ల‌తో ఆడుకున్న తెలంగాణ ఇంట‌ర్ బోర్డు.. గ్లోబ‌రీనా అనే ప్రైవేటు సంస్థ సేవ‌ల‌పై ఆధార‌ప‌డింది. 


అయితే, ఈ సంస్థ సేవ‌ల‌పై ఇప్పుడు అనేక అనుమాన‌పు మేఘాలు క‌మ్ముకున్నాయి. విద్యార్థుల స‌మాధాన ప‌త్రాల మూ ల్యాంక‌నం త‌ర్వాత బ‌బ్లింగ్ చేయ‌డం, త‌దుప‌రి ఫ‌లితాల‌ను రికార్డుచేసి బోర్డుకు అందించ‌డం ఈ సంస్థ విధులు. అయి తే, ఇక్క‌డ అస‌లు తేడా కొట్టింద‌ని అంటున్నారు. ఈ సంస్థ నిర్వ‌హ‌ణ అస్త‌వ్య‌స్థంగా మార‌డంతోనే విద్యార్థులకు ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని చెబుతున్న వారు కూడా క‌నిపిస్తున్నారు. ఇక‌, ఈ ఇంట‌ర్ విద్యార్తుల ఆగోతంపై తెలంగాణ స‌ర్కా రు సిట్ ద‌ర్యాప్తుకు ఆదేశించింది. ఏదేమైనా తెలంగాణ ఇంట‌ర్ బోర్డులోనూ అధికారుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు పెరిగింది. అడ్మినిస్ట్రేషన్‌, అకౌంట్స్‌, పరీక్షల విభాగాల్లో పని చేసే ఈ ఉద్యోగులదే ఇష్టారాజ్యం. ప్రతి సెక్షన్‌లోనూ వారి పెత్తనం ఉటుంది. ఏ పనైనా సరే వీరి కనుసన్నల్లో జరగాల్సిందే! 


టెండర్‌ ప్రక్రియ అయినా.. ఇంకేదైనా కానీ వారి ప్రమేయం లేకుండా పూర్తికాదు. బోర్డు ఉన్నతాధికారికి వారు నమ్మిన బం టుగా ఉంటూ తెరవెనుక తతంగం నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా కీలక అంశానికి సంబంధిం చిన ఫైల్‌ను మధ్యలోని ఇతర అధికారులతో సంబంధం లేకుండా వీరు నేరుగా ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లగల‌గడం ప్ర‌త్యేక‌త‌. ఏదేమైనా .. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్ర‌భ ఒక్క‌సారిగా మ‌స‌క‌బారింది.ఇదిలావుంటే, గ్లోబ‌రీనా సంస్థ‌పై ఇప్పుడు ఏపీలోనూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

జేఎన్టీయూ కాకినాడ ప‌రిదిలో సంబందిత ప‌నుల‌ను నిర్వ‌హించేందుకు గ్లోబ‌రీనాకు 2013లో కాంట్రాక్టు ఇచ్చారు. అయితే, జేఎన్టీయూతో ఒప్పందం మేర‌కు అడిగిన కంటెంట్ ప్రోప‌ర్ కంటెంట్‌ను డెవ‌ల‌ప్ చేయ‌క‌పోవ‌డంతో ఈ రెండు సంస్థ‌ల మ‌ధ్య వివాదం నడుస్తోంది. ఒప్పందం ర‌ద్దు చేశామ‌ని జేఎన్ టీయూ చెబుతుండ‌గా, మేం కొర్టుకు వెళ్లామ‌ని, ఒప్పందం మ‌ధ్య‌లో ఎలా ర‌ద్దు చేస్తార‌ని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇంట‌ర్ విద్యార్థుల‌తో గ్లోబ‌రీనా చెల‌గాటం ఆడుతోంద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: