ఏపీలో అనూహ్యంగా మారిన‌ రాజ‌కీయ ప‌రిణామాలు.. సంచ‌ల‌నాల‌కు వేదిక అవుతున్నాయి. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా కూ డా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఇక‌, మ‌న రాష్ట్రంలో ఎన్నిక‌లు ఈ నెల 11న పూర్త‌య్యాయి. అయినా కూడా ఫ‌లితా లు వ‌చ్చే మే 23 వ‌ర‌కు కూడా రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమల్లోనే ఉంటుంది. అయితే, ఇన్ని రోజుల గ్యాప్ రావ‌డంతో ప్ర భుత్వాన్ని ఎవ‌రు పాలించాలి? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది కాబ‌ట్టి ఎన్ని క‌ల సంఘం సూచ‌న‌ల మేరకు ప్ర‌బుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పాల‌న‌ను కొన‌సాగించాలి. అయితే, ఇక్క‌డ ఏపీలో అతి పెద్ద అఘాతం ఏర్ప‌డింది. ఎన్నిక‌లు ముగిశాయి కాబ‌ట్టి కోడ్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని త‌మ పాల‌న‌తాము చేస్తామ‌ని చంద్ర‌బాబు అండ్ కో చెబుతున్నారు. 


ఇటీవ‌లో చంద్ర‌బాబు సంబంధిత అదికారుల‌తో క‌లిసి పోల‌వ‌రం పై స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. అయితే, ఇక్క‌డ బాబుకు గ‌ట్టి దెబ్బ‌త‌గిలింది. స‌మీక్ష‌లు ఎలా నిర్వ‌హిస్తార‌ని, ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఆప‌ద్ధ‌ర్మ సీఎంగా ఉన్నార‌ని వైసీపీ నేతలు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో మ‌ళ్లీ ఎక్క‌డ ఇబ్బంది వ‌స్తుంద‌ని అనుకున్నారో .. ఏమో చంద్ర బాబు దేశ ప‌ర్య‌ట‌న ప్రారంభించారు. అయితే, రాష్ట్రంలో అకాల వ‌ర్షాలు, ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లకు సంబంధించి స‌మీక్ష లు నిర్వ‌హించాలి. అయితే, కోడ్ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వీటికి దూరంగా ఉండాల‌నేది వైసీపీ వాద‌న‌. ఇక‌, ఎన్నిక‌ల సంఘం కూడా బాబును దూరం పెట్టింద‌ని అంటున్నారు అయితే, బ‌హిరంగంగా కాక‌పోయినా.. అధికారులు ఎవ‌రూ కూడా సీఎం స‌మీక్ష‌ల‌కు హాజ‌రు కావ‌డం లేదు. 


దీంతో ప్ర‌భుత్వానికి, పాల‌న‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌ను సీఎస్ ఎల్వీసుబ్ర‌హ్మ‌ణ్యం మాత్ర‌మే చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయా స‌మీక్ష‌ల‌ను కూడా ఎల్వీనే నిర్వ‌హిస్తున్నారు. అయితే, ఈ విష‌యాన్ని టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు అంత తేలిక‌గా వ‌దిలేస్తారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రో కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో జ‌రుగుతున్న సీఎస్ స‌మీక్ష‌ల‌ను, వైసీపీ ఈసీకి రాసిన‌ట్టుగా చెబు తున్న‌లేఖ‌ల విష‌యాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటార‌నే వ్యాఖ్య‌లు టీడీపీ నుంచే వినిపిస్తుండ‌డం గ‌మ‌నా ర్హం. చంద్రబాబు భవిష్యత్ లో పరిషత్ ఎన్నికల దృష్ట్యా ముందు ప్లాన్ చేస్తున్నారు..దీని వల్ల ప్రతిపక్షాలు తనపై విమర్శలు చేసినా అది సానుభూతిగా మరల్చుకునేందుకు కుట్ర చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: