శ్రీలంక‌ను వ‌రుస పేలుళ్లు ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది. కొలొంబోలో మ‌రోసారి బాంబు పేలుడుతో జ‌నం ఉలిక్కి ప‌డ్డారు. స‌బాయి థియేట‌ర్ స‌మీపంలో అమ‌ర్చిన బాంబును సైన్యం నిర్వీర్యం చేసింది. లంక‌లో మ‌రిన్ని దాడుల‌కు పాల్ప‌డుత‌న్నామంటూ ఐసిస్ ఉగ్ర‌వాద సంస్థహెచ్చ‌రించ‌డంతో హైఅల‌ర్ట్ కొన‌సాగుతుంది. ఓ కంటైన‌ర్‌తో పాటు వ్యానులో పేలుడు ప‌ధార్థాలను త‌ర‌లించిన‌ట్లు పోలీసు నిఘా వ‌ర్గాలు గుర్తించాయి. ఈ నేప‌థ్యం దేశ వ్యాప్తంగా గాలింపు చ‌ర్య‌లను ముమ్మ‌రం చేశారు. 


అయితే వ‌రుస పేలుళ్ల‌కు పాల్ప‌డే ముందు నేష‌న‌ల్ తాహి జ‌మాత్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన ఎనిమిది మందికి చెందిన ఉగ్ర‌వాదులు ప్ర‌తిజ్ఞ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుద‌ల చేశారు. అందులో అంద‌రు క‌లిసి ప్ర‌తిజ్ఞ చేస్తున్నారు. ముస్లింల ఊచ‌కోత‌కుప్ర‌తీకారంగా చ‌ర్చ్‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ద్వారా తెలిపారు ఉగ్ర‌వాదులు. దాడుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు. ఐసిస్ ఉగ్ర‌వాద సంస్థ వీళ్ల‌కు ఆత్మాహుతి దాడుల్లో శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. 


శ్రీలంక‌లో ఆత్మాహుతి దాడికి పాల్ప‌డ్డ ఎనిమిది మంది ఉగ్ర‌వాదులు త‌మ దేశం వారేన‌ని ఆ దేశ ప్ర‌భుత్వ వ‌ర్గాలు కూడా ద్ర‌వీక‌రించాయి. సూసైడ్ బాంబ‌ర్స్‌కు జహ్రీన్ అషీమ్ అలియాస్ అబు ఉబైదా నేతృత్వం వ‌హించాడు. ఎన్టీజే ఉగ్ర‌వాద సంస్థ ఐసిస్ తో నిరంత‌రం ట‌చ్‌లోఉంటున్న‌ట్లు శ్రీలంక నిఘా వ‌ర్గాలు ద్ర‌వీక‌రించాయి. సూసైడ్ బాంబర్ల‌లో ఉబైద్ మాత్రమే ముసుగు లేకుండా వీడియోలో క‌నిపిస్తోంది. 


మ‌రోవైపు కొలోంబోలు షంగ్రీనా హోట‌ల్లో జ‌రిగిన ఆత్మాహుతి దాడికి సంబంధించి కూడా సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు విడుద‌ల చేశారు. మ‌హ్మ‌ద్ కాసీమ్, మ‌హ్మ‌ద్ స‌మ్రాన్ అనే ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హోట్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు గుర్తించారు. రిసెఫ్ష‌న్ కౌంట‌ర్ ద‌గ్గ‌ర‌కువ‌చ్చిన ఉగ్ర‌వాదులు త‌మ‌ను తాము పేల్చుకున్న‌ట్లు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో శ్రీలంక‌లో మృతుల సంఖ్య 31 కి చేరింది. 500 మందికి పైగా పేలుళ్ల‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 13 మంది భార‌తీయులు కూడా ఉన్న‌ట్లు విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది. 


ఇదిలా ఉంటే మ‌రోవైపు లంక‌లో ఆత్మాహుతి దాడికి పాల్ప‌డ్డ వ్య‌క్తి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఈనేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆ వీడీయో మొత్తం బ‌హిర్గ‌మైంది. వీపుపై బ‌రువైన బ్యాగ్ ధ‌రించిన ఆ వ్య‌క్తి చ‌ర్చిలోకి ప్ర‌వేశించాడు.నిగంబో ప‌ట్ట‌ణం సేయింట్సెబాస్టియ‌న్ చ‌ర్చ్‌లో బాంబు దాడికి పాల్ప‌డ్డాడు. వ‌రుస బాంబు పేలుళ్ల‌తో పోల్చుకుంటే ఇక్క‌డే ఎక్క‌వ మంది మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం. 

ఇక శ్రీలంక వ‌రుస బాంబు ఘ‌ట‌న పేలుళ్ల‌పై ద‌ర్యాప్తు వేగ‌వంత‌మైంది. ఇప్ప‌టికే 40 మంది అనుమానితులు పోలీసులు అదుపులోకి తీసుకు్న‌నారు. అందులో సూసైడ్ బాంబ‌ర్ల తీసుకొచ్చిన వ్యాన్ డ్రైవ‌ర్ కూడా ఉన్న‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: