ఏపీలో చంద్రబాబు పాలనలో తిరుపతి దేవుడికి కూడా భద్రత లేకుండా పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వరసగా టీటీడీ కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాలు అనుమానాలు కలిగిస్తున్నాయని ఆయన చెప్పారు. టీటీడీ బంగారం తరలింపు విషయంలో జరిగిన అవకతవకలను ఆయన కడిగిపారేశారు. మీడియాతో ఆయన ఈ రోజు మాట్లాడుతూ బాబుపైన హాట్ కామెంట్స్ చేశారు.


టీటీడీకి చెందిన బంగారం చెన్నై నుంచి తిరుపతి తరలించేటప్పుడు హైవేపై రాకుండా.. వేపం పట్టు అనే లోపలి రోడ్డు నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది?  గోవిందరాజస్వామి ఆలయంలోని కిరీటాలు చోరీ చేశారు.. ఇద్దరు జేబు దొంగలను పట్టుకుని కిరీటాలు వారే కాజేశారని మభ్యపెడుతున్నారు. వాళ్లు కిరీటాలను కరిగించారని చెబున్నారు. ఏ ఇంటిని సోదా చేస్తే కిరిటీలు దొరుకుతాయో పోలీసులకు తెలుసు. అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.


ఇదిలా ఉండగా   దేవుడి సొమ్ము అంటే చంద్రబాబుకు భయం లేకుండా పోయింది. టీటీడీ బంగారం తరలింపుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నియమించిన కమిటీ నివేదిక సమర్పించాక అందులోని వివరాలను బయటపెట్టాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. . ‘చంద్రబాబు పాలనలో టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను, ఆ తర్వాత ముగ్గురు అర్చకులను తొలగించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడిని టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించారు. ఉత్తరాదికి చెందిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను టీటీడీ ఈఓగా నియమించారు. ఇదంతా దేనికోసమో ఇపుడు అర్ధమవుతుందని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: