అదేంటో దేశంలో ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి ఇపుడు ఏపీలో ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఉండీ లేనట్లుగా ఉంది. దానికంతటికీ కారణం కూడా ఉంది. ఇలా తెగే దాకా లాగేసి ఇంతవరకూ తెచ్చుకున్నట్లుగా అనిపిస్తోంది. మొత్తానికి చూస్తూండగానే ఒక్కోటీ మారిపోతోంది. మొత్తం సీనే చేంజ్ అయిపోయిందిగా


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. కానీ ఇపుడు హడావుడి చేస్తోంది మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఎన్నికల నేపధ్యంలో అనిల్ పుణెఠాను పక్కన పెట్టి మరీ ఏరి కోరి ఆయన్ని ఏపీ సీఎస్ గా పంపించారు. సీనియర్ అధికారి ఐన సుబ్రహ్మణ్యం వచ్చిన దగ్గర నుంచి ఓ పద్ధతి ప్రకారం తన పని తాను చేసుకుపోతున్నారు. మధ్యలో బాబు సమీక్షలు అంటూ హడావుడి చేసినా కోడ్ పేరు చెప్పి  అధికారులు ఎవరూ హాజరుకాలేదు.


ఇపుడు సీఎస్ ఏకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కలెక్టర్లతో ఆయన రివ్యూస్ చేశారు. మొత్తం పదమూడు జిల్లాల కలెక్టర్లతో ఆయన ఎన్నికల అనంతర పరిస్థితిని సమీక్షించారు. టీటీడీ బంగారం తరలింపు విషయంలోనూ మన్మోహన్ సింగ్ ఆద్వర్యంలో ఓ కమిటీని అపాయింట్ చేసి నివేదిక తెప్పించుకున్నారు. మొత్తానికి సీఎస్ ఏపీలో పాలనంతా తన గుప్పిట్లో తెచ్చుకుని చకచకా ముందుకుపోతున్నారు.
మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎక్కడా సందడి చేయకుండా కట్టడి చేసేశారు. మొత్తం మీద చూసుకుంటే మే 23న ఫలితాలు తరువాత ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పటి నుంచి బాబు గారి పవర్ మొత్తం పాయే అన్నట్లుగా ఏపీలో పరిస్థితి తయారైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: