ఎన్నిక‌లు ముగిసిన ఏపీలో ఫ‌లితం ఏవీఎంల‌లో నిక్షిప్త‌మైంది. అయితే, ఎన్నిక‌ల‌కు ముందు ఎంత తీవ్ర‌మైన ఉత్కంఠ కొన‌సాగిందో.. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కూడా రాష్ట్రంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం అంతే ఉత్కంఠ‌గా సాగుతోంది. ముఖ్యంగా హేమా హేమీలు త‌ల‌ప‌డిన కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికీ ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. వీరిలో కీల‌క‌మైన నాయ‌కుడు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం  వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, వైఎస్‌కు అత్యంత స‌న్నిహితుడిగా మెలిచిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తాజా ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ధ‌ర్మాన‌.. ఇక్క‌డ బ‌ల‌మైన పోటీ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ధ‌ర్మాన తాజా ఎన్నిక‌ల్లో మాత్రం గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో కృషి చేశారు. 

Image result for dharmana prasada rao

1985 నుంచి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వ‌రుస‌గా 1999 వ‌ర‌కు కూడా టీడీపీ అభ్య‌ర్థి గుండా అప్ప‌ల సూర్య‌నారాయ‌ణ‌ విజ‌యం సాధించారు. దీంతో జిల్లాలోనే కాకుండా శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ బ‌ల‌మైన శ‌క్తిగా అవ‌త‌రించింది. ఇక‌, 2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌వాతో దూకుడు ప్ర‌ద‌ర్శించిన ధ‌ర్మాన‌.. ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించారు. ఇక‌, 2009లోనూ ఆయ‌న విజ‌య‌ప‌రంప‌ర కొన‌సాగింది. అయితే, 2014 ఎన్నిక‌ల‌కు ముందు మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ధ‌ర్మాన కాంగ్రెస్‌ను వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపిం చారు. అధికార పార్టీ టీడీపీని త‌న‌దైన శైలిలో టార్గెట్ చేశారు. ముఖ్యంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన ఇసుక మాఫియా, భూ కుంభ కోణాల‌కు సంబంధించి గ‌ట్టి గ‌ళం వినిపించారు. 


దీంతో ధ‌ర్మాన హ‌వా నియోజ‌క‌వ‌ర్గంలోను, జిల్లాలోనూ స‌జీవంగా నిలిచింది. ఇక‌, పార్టీలోనూ జ‌గ‌న్ అత్యంత అమితంగా గౌర‌వించే నేత‌ల్లో ధ‌ర్మా న ఒక‌రుగా నిలిచారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం నుంచి గుండా అప్పల సూర్య‌నారాయ‌ణ స్థానంలో ఆయ‌న ఆయ‌న స‌తీమ‌ణి ల‌క్ష్మీదేవి పోటీ చేసి ధ‌ర్మాన‌పై విజ‌యం సాధించారు. గ‌తంలో ఎన్న‌డూ సాధించ‌నంత 24 వేల ఓట్ల మెజారిటీతో ల‌క్ష్మీదేవి విజ‌యం సాధించారు. అయితే, గ‌డిచిన ఐదేళ్ల‌లో ఆమె ప‌నితీరు అంత‌గా బాగోలేద‌నే టాక్ వ‌చ్చింది. పైగా వ‌యో వృద్ధురాలు కావ‌డం, కుటుంబం కొంత దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం కూడా గుండా ఫ్యామిలీకి వ్య‌తిరేకత వ‌చ్చేలా చేసింది. ఇక‌, ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ధ‌ర్మాన‌పై సానుభూతి ప‌వ‌నాలు వీచాయ‌ని తెలుస్తోంది. 

Related image

అయితే, గుండా ల‌క్ష్మీదేవి మ‌రోసారి పోటీ చేయ‌డం, కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని ఇల్లిల్లూ తిరిగి ప్ర‌చారం చేయ‌డం ఈ ఇద్ద‌రి మ‌ధ్య పోరును తీవ్ర త‌రం చేసింది. దీంతో శ్రీకాకుళంలో గుండా వ‌ర్సెస్ ధ‌ర్మాన అన్న విధంగానే ఎన్నిక‌ల పోరాటం కొన‌సాగింది. ఇక‌, ఇక్కడ నుంచి జ‌న‌సేన త‌ర‌ఫున కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు, కాంగ్రెస్ త‌ర‌ఫున చౌద‌రి స‌తీష్‌, బీజేపీ త‌ర‌ఫున చ‌ల్లా వెంక‌టేశ్వ‌ర‌రావు పోటీకి దిగారు. అయినా కూడా ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్యే పోరు నెల‌కొంద‌ని అంటున్నారు. పోటీ ఎలా ఉన్నా ధ‌ర్మాన ఇక్కడ మంత్రిగా ప‌నిచేసిన ప‌దేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌లోనే జ‌ర‌గ‌ని అభివృద్ధి జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే ఈ సారి శ్రీకాకుళం ప్ర‌జ‌లు ధ‌ర్మాన‌ను గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గ రూపురేఖ‌లు మార‌తాయ‌న్న ఆశాభావంతో ఉన్న‌ట్టు క‌న‌ప‌డింది. గుండ ల‌క్ష్మీదేవిపై ఉన్న అంచ‌నాల‌తో పోలిస్తే ఐదేళ్ల‌లో ఇక్క‌డ పెద్ద‌గా జ‌రిగిందేమి లేద‌న్న టాక్ కూడా ఆమెకు మైన‌స్‌గా మారింది. మ‌రి ఫైన‌ల్‌గా ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: