చంద్రబాబు, కేసీఆర్.. ఇద్దరూ ఇద్దరే.. ఒకరు దాదాపు 15 ఏళ్లు సీఎంగా పాలించి చక్రం తిప్పిన వ్యక్తి. మరొకరు.. అసలు సాధ్యమవుతుందా అనుకున్న తెలంగాణను తెచ్చిచూపించిన వ్యక్తి.. అంతే కాదు.. చంద్రబాబును ఏపీకే పరిమితం చేసిన రాజకీయ ఘనాపాఠి.


ఐతే.. ఈ ఇద్దరూ ఇప్పుడు కొడుకుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి. సేవామిత్ర యాప్ ద్వారా ప్రభుత్వం దగ్గరున్న డాటా వాడుకునేందుకు అవకాశం ఇచ్చింది ఏపీ సర్కారు, ఆ నిర్ణయం తీసుకున్నది లోకేశ్ అంటారు. కానీ ఈ నిర్ణయం వల్ల చంద్రబాబు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ముఖ్యమంత్రిగా ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. 

ఇప్పుడు తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల మార్కుల గందరగోళం వెనుక ఉన్న సంస్థ ఎంపికలో కేటీఆర్ ప్రమేయం ఉన్నట్టు మీడియా సర్కిల్లో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ ఉదంతం కారణంకా కేసీఆర్ బాగా ఇబ్బందిపడ్డారు. 

సో ఈ రెండు ఉదంతాల్లోనూ కొడుకులు చేసిన తప్పిదాల వల్ల తండ్రులు రాజకీయంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వారు ఈ ఇబ్బందుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడతాయని సూచిస్తున్నారు. ఇదీ సంగతి.



మరింత సమాచారం తెలుసుకోండి: