మొదటి నుంచి ఊహిస్తున్నట్టుగానే జనసేన కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవుతుందన్న అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. పవన్ కల్యాణ్ తాను గెలిచినా గెలవకపోయినా ఎదుటివారి గెలుపును ప్రభావితం మాత్రం చేసేలా ఉన్నాడు. ఈ విషయంపై తెలుగుదేశం నాయకులు మథనపడుతున్నారు.


కనీసం 30 నుంచి 35 స్థానాల్లో జనసేన నాయకులు తమ స్థానాల్లో తమకు సమస్యగా తయారయ్యారని టీడీపీ నాయకులు ఫీలవున్నారట. ఈ మేరకు వారు చంద్రబాబు వద్ద కూడా ఈ విషయం ప్రస్తావించారట. ఇలా ప్రస్తావించిన వారిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారట. 

అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో పది మంది.. విశాఖకు చెందిన మరో పది మంది.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఐదు మంది.. మొత్తం 35 మంది తమ స్థానాల్లో జనసేనతో ముప్పు ఉందని చంద్రబాబుకు చెప్పారట. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా వారి వద్ద అంగీకరించినట్టు తెలుస్తోంది. 

చంద్రబాబు మరో విషయం కూడా పార్టీ నేతలతో పంచుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. ఈ 35 మాత్రమే కాదు.. మరో 30 వరకూ సీట్లను పోల్ మేనేజ్‌మెంట్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల కోల్పోతున్నామని అన్నట్టు నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారట.  మొత్తానికి తెలుగుదేశం నేతలకు జనసేన భయం  బాగానే పట్టుకుందన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: