అసమగ్ర అసమాన ఉద్యోగ అవకాశాలు స్త్రీ పురుషుల మద్య ఉద్యోగాల అంతరాలకు దారి తీస్తుంది. అదే విషయాన్ని ఆక్స్- ఫామ్ ఇండియా తన రెండవ ఎడిషన్ లో "ఇండియా ఇనీక్వాలిటీ రిపోర్ట్" లో సమగ్రంగా చర్చించింది. స్త్రీ పురుష ఉద్యోగాల్లో వేతనాల మద్య వ్యత్యాసమే దీనికి కారణమని తెలియజేసింది. 

Image result for india inequality report 2019 of Oxform India

ప్రస్తుత అభివృద్ధి నమూనాల (డెవలప్మెంట్ మోడల్) కారణంగా నిరుద్యోగ స్థితి (స్టేట్ ఆఫ్ అనెంప్లొయిమెంట్) దారుణంగా ఉందని ‘ఆక్స్- ఫామ్ ఇండియా’ తన తాజా నివేదికలో తెలిపింది. అధికంగా ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రభుత్వం తన అభివృద్ధి దృష్టిని కార్మిక అవసరాలు ఎక్కువగా ఉండే రంగాలపై సారించాల్సి ఉందని సూచించింది.

unemployment in india

The second edition of Oxfam India’s ‘India Inequality Report’ – Mind the Gap: The State of Employment in India– approaches structural inequalities in India’s vast labor market with a particular focus drawn on gender disparities within it.

Image result for india inequality report 2019 of Oxform India

“మైండ్ ద గ్యాప్ - స్టేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా”  పేరుతో ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదికలో భారత ఉద్యోగ మార్కెట్లో అసమానతలకు దేశంలో నాణ్యమైన ఉద్యోగాల కొరత, వేతన వ్యత్యాసాల పెరుగుదల ప్రధాన కారణాలని పేర్కొంది.

Image result for salary disparities in india

ఉపాధిలో అసమానతల అంతరం మరింతగా పెరగకుండా ఉండేందుకు ఎక్కువ ఉద్యోగాలు సృష్టించే కార్మిక శక్తి ప్రధానమైన రంగాలపై దృష్టి పెట్టాలని ఆక్స్-ఫామ్ అభిప్రాయపడింది. పొరుగు దేశాలతో, ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు భారత్ లో సంబద్ధ నైపుణ్య అవకాశాలు ఉండాలని తెలిపింది.

Image result for salary disparities in india

Image result for india inequality report 2019 of Oxform India

కార్పొరేట్ల పన్ను మినహాయింపులను తగ్గించేందుకు పోటీ పడటం తగ్గించి, ప్రగతిశీల పన్నుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఆక్స్ ఫామ్ ఇండియా చెప్పింది. ఈ చర్యలతో అదనంగా వచ్చిన ఆదాయాన్ని సామాజిక భద్రతలో పెట్టుబడులుగా, విద్య, వైద్యం వంటి అత్యవసర సేవలకు ఉపయోగించవచ్చని సూచించింది.

Image result for india inequality report 2019 of Oxform India

ఆక్స్ ఫామ్ ఇండియా నివేదిక ప్రకారం సగటున మహిళా కార్మికులు బాగా దెబ్బ తింటున్నారు. సమాన అర్హత కలిగిన పురుషులకు అదే పనికి ఇచ్చే వేతనం కంటే మహిళలకు 34 శాతం తక్కువ మొత్తం చెల్లించడం జరుగుతున్నట్టు ఆక్స్ ఫామ్ ఇండియా గుర్తించింది.

 Image result for india inequality report 2019 of Oxform India

మరింత సమాచారం తెలుసుకోండి: