తెలంగాణలో లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న గ్లోబరీనా టెక్నాలజీస్‌ విషయంలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గ్లోబరీనాకు ఈ పని అప్పగించేందుకు ఉండాల్సిన కనీస అర్హతలు కూడా లేవన్న విషయం నిపుణుల కమిటీ విచారణలో తేలుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇంటర్‌బోర్డు అధికారులు వ్యవహరించినట్లు త్రిసభ్య కమిటీ తేల్చింది. 


టెండరు వేసేందుకు గ్లోబరీనాకు సాంకేతిక అర్హత లేవు. ఈ పని చేసేందుకు అనుభవం చూపించే అనుభవ ధ్రువీకరణ పత్రాలు కూడా లేవు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్ కాపీ కూడా లేదు. ప్రోటో కాల్ డాక్యుమెంట్, ఎగ్జామ్ ఫ్లోచార్డ్ లేవు.. 

పొరపాట్లు జరిగితే లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా లేదు. కేవలం పర్చేజ్ ఆర్డర్ ఆధారంగానే గ్లోబరీనాకు ఇంత కీలకమైన బాధ్యతలను అప్పగించినట్టు విచారణలో తెలుస్తోంది. ఈ పనులు అప్పగించేందుకు అవసరమైన డిటైల్డ్ అగ్రిమెంట్ కానీ... లీగల్ అగ్రిమెంట్‌ కానీ.. కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్‌ కానీ గ్లోబరీనాకు లేకపోవడం దారుణం.

అంటే లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన కీలకమైన విషయాన్ని ఇలాంటి లుచ్చా.. బచ్చా కంపెనీకి ఎలా అప్పగించారన్న విషయం అంతు తేలకుండా ఉంది. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఈ పోయిన ప్రాణాలను తెచ్చేదెవరు.. ఆ కుటుంబాల్లో గర్భశోకం తీర్చేదెవరు..? 



మరింత సమాచారం తెలుసుకోండి: