వైసీపీకి ఇపుడు ఏపీ ఎన్నికల్లో గెలుపు తధ్యమని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఎన్నికల ముందు తరువాత కూడా చేసిన పలు సర్వేలు జగన్ పార్టీ విజయం ఖాయమని చెబుతూ వస్తోంది. అయితే జగన్ కీకలమైన ఎన్నో హామీలను ఈసారి ఎన్నికల్లో ఇచ్చారు. వాటిని సాధించి తీరుతామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఇపుడున్న పరిష్తితుల్లో జగన్ గెలిచినా అది సాధ్యపడుతుందా


ముందుగా ప్రత్యేక హోదా గురించి చెప్పుకోవాలి. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని అంతా అంటున్నారు. సర్వేలు కూడా పదే పదే చెబుతున్నది ఇదే. అయితే పూర్తి మెజారిటీ రావడం కష్టమని తక్కువలో తక్కువ సీట్లోతో మోడీ మళ్ళీ పీఎం పీఠం ఎక్కుతారని అంటున్నారు  మోడీ ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా అన్నది అతి పెద్ద ప్రశ్న. ఎందుకంటే బాబుకు, మోడీకి చెడింది అక్కడే కాబట్టి.


ఇక మోడీకి జగన్ విషయంలో ప్రత్యేకమైన అభిమానం ఏదీ లేదు. ఆయనకు ఏపీ పట్ల కూడా పెద్దగా అభిమానం ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే సీట్లు తగ్గితే మాత్రం మోడీ హోదా ఇస్తానని చెప్పి మద్దతు తీసుకుంటారా అన్నది ఇక్కడ పాయింట్. జగన్ చెబుతున్నట్లుగా ఎవరు హోదాకు మద్దతు అంటే వారికే తాము అండగా ఉంటామని అంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు  కోసం హోదా ఇస్తామని చెప్పి ఆనక హోదాకు నో అంటే అపుడు జగన్ ఏం చేయగలరు. ఇదొక ప్రశ్న.


ఇక ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి తొలి ఏడాది నుంచే ధర్మ పోరాటాలు బాబు మాదిరిగా చేస్తే జనం స్వాగతిస్తారా. అదే విధంగా మోడీ సైతం సామదాన భేద దండోపాయలు జగన్ మీద ఉపయోగించకుండా ఉంటారా. ఒకసారి ప్రధాని ఐపోయాక సర్వ శక్తులు తన వద్దకు వచ్చాక ఈడీ, సీబీఐ, ఐటీ ఇలాంటివి ప్రయోగించి ఐన మద్దతు ఎంపీలను లొంగదీసుకుంటే జగన్ హామీ ఏమవుతుంది. ఇవన్నీ  ప్రశ్నలే. సో ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా రావడం అన్నది అంత సులువు కాదేమో అనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: