రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు ఏది చేసినా దానికి ఓ లాజిక్ ఉంటుంది. ఆయన అన్న మాటలు వూరికే ఉండవు. వెనకాల ఓ కధా కమామీషూ ఉంటాయి. ఏపీలో తొలివిడత ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత గత పదిహేను రోజులుగా కధ  ఎన్నో మలుపులు తిరుగుతోంది. రాజకీయం వాడి, వేడి ఎక్కడా తగ్గడంలేదు. దానికి అధికార పక్షం, వైరిపక్షం కూడా ఎగదోస్తున్నాయి.


నేను జూన్ 8న ప్రమాణం చేశాను. అప్పటివరకూ నేనే సీఎం. ఈ మాటలు నాలుగు రోజుల క్రితం చంద్రబాబు అన్నారు. ఆయన అన్న దాన్ని వైసీపీ వేళాకోళం చేసింది. మే 23తో బాబు మాజీ అనేశారు ఆ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు. కానీ రాజ్యాంగం పరంగా చూసినపుడు బాబుకు జూన్ 8 వరకూ టైం ఉందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయినట్లైతే బాబు వెంటనే రాజీనామా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. అధికార మార్పిడి అంతా సవ్యంగా సజావుగా సాగిపోతుంది.


అయితే బాబు చెబుతున్నట్లుగా తాను జూన్ 8 వరకూ అధికారంలో కొనసాగుతాను అని రాజీనామా చేయకపోతే మాత్రం అది ఇబ్బందులను స్రుష్టించే అవకాశం ఉంటుంది. బాబుపై చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకున అవకాశం కానీ, అధికారం కానీ గవర్నర్ సహా ఎవరికీ లేవని అంటున్నారు. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. బాబు జూన్ 8న సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల అంతవరకూ ఆయన సీఎం గా కొనసాగ‌డం చట్టసమ్మతమేనని నిపుణులు సెలవిస్తున్నారు. 


అయితే నైతికత పరంగా చూస్తే మాత్రమే బాబుది తప్పు అవుతుందని అంటున్నారు. మరి నైతికంగా చూసి రాజకీయాలు చేసే వారు ఈ రోజుల్లో ఎవరు ఉన్నారు. అందువల్ల బాబు ఫలితాలు వ్యతిరేకంగా వస్తే రాజీనామా చెస్తే  ఒకే. చేయకపోతే మాత్రం జూన్  8 వరకూ ఆయన ఆపద్ధర్మ సీఎంగా హ్యాపీగా  కొనసాగవచ్చు అని నిపుణులు అంటున్నారు. అది ఓ విధంగా గెలిచిన పార్టీకి సంకట పరిస్థితే. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: