టిక్ టాక్.. ఇటీవల భారత్ లో ఇంతగా చర్చనీయాంశమైన యాప్ ఇంకొకటి లేదు. ఈ టిక్ టాక్ కారణంగా పిల్లలు, యూత్, పెద్దలకు మంచి టైంపాస్ అవుతోంది. తమను తాము సినీహీరోల్లా, హీరోయిన్లలా చూసుకునే వెసులుబాటు కలుగుతోంది. 


కానీ ఈ పిచ్చి క్రమంగా వెర్రిగా మారి కోర్టుల వరకూ వెళ్లింది. ముత్తుకుమార్ అనే న్యాయవాది టిక్‌టాక్‌పై కేసు వేయడంతో హైకోర్టు మధ్యంతర నిషేధాన్ని విధించింది. ఈ తీర్పుతో పెద్దల్లో చాలా ఊరట లభించింది. అయితే ఈ ఆనందం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. తాజాగా..  సుప్రీంకోర్టు ఈ  టిక్‌టాక్‌ పై నిషేధం ఎత్తేసింది.

ఎందుకంటే.. టిక్ టాక్ బ్యాన్ చేసిన కారణంగా రోజుకు 3.5 కోట్లు నష్టం వాటిల్లిందని, 250 మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టుదై ఫైనల్ నిర్ణయమని సుప్రీంకోర్టు చెప్పింది.

దీంతో మద్రాసు హైకోర్టు టిక్ టాక్ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు చెప్పింది. కాకపోతే.. పోర్నోగ్రఫీ వంటి వీడియోలను అప్‌లోడ్ చేయకూడదని రూల్ పెట్టింది. ఈ విషయమై వైఫల్యం చెందితే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. కానీ ఈ టిక్ టాక్ తో మళ్లీ యూత్ రెచ్చిపోవడం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: