1
మనకు కాలం కలసి రానప్పుడే మన ఆగర్భశత్రువు హిమోన్నతంలా ఎదిగిపోతూ ఉంటే కులం, కుల మీడియా కూడా హెల్ప్ చేయలేని పరిస్థితిలో పడుతుందన్నారు తెలుగు పెద్దలు. అప్పుడు మన గుండె చెదరదా! కళ్లు చెమర్చవా! పాపం మన బాబు పరిస్థితి అంతేలా ఉంది.  ఒకవైపు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నా – నరేంద్ర మోడీ వ్యతిరేకులు రకరకాల ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నా, నరేంద్ర మోడీ మానియాను మాత్రం ఎవరూ అడ్డుకోలేక పోతున్నారని అంటు న్నాయి సర్వేలు.  ఏప్రిల్ నెలలో ప్రజానాడి ఎలా ఉందనే అంశం గురించి జరిగిన ఒక పరిశీలన ఇదే అంశాన్ని చెబుతూ ఉంది. “సీ. ఓటర్- ఐఏఎన్ఎస్ ట్రాకర్” ఈ విషయాన్ని చెబుతూ ఉంది. ప్రధాన మంత్రిగా ప్రజల ఎంపిక  విషయంలో నరేంద్ర మోడీకి సాటి వచ్చే వారు దరిదాపుల్లో లేరని ఈ ట్రాకర్ అధ్యయనం చెబుతోంది. 
Image result for c voter IANS Tracker Latest Report
ప్రధానమంత్రిగా ఎవరిని ఎంచుకుంటారనే అంశం గురించి ప్రజల ముందు కొన్ని పేర్లను ఛాయిస్ గా  ఉంచగా, వాటిల్లో మెజారిటీ మంది ప్రజలు  నరేంద్ర మోడీ వైపే ముగ్గు చూపు తున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. ప్రత్యేకించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ విషయంలో నరేంద్ర మోడీకి, వెనుక చాలా చాలా దూరంలో ఉన్నారని ఈ అధ్యయనం  ప్రకటించింది.
Image result for c voter IANS Tracker Latest Report
పన్నెండు వేల శాంపిల్స్ తో చేసిన ఈ అధ్యయనంలో 56 % అక్షరాల యాభై ఆరు శాతం మంది-మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే ఎంచుకున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. రాహుల్ గాంధీ ప్రధానిగా కావాలన్న వారి శాతం కేవలం 22% (ఇరవై రెండు శాతం మాత్రమే) అని  అధ్యయనం వివరించింది. అంటే రాహుల్ గాంధి కన్నా నరేంద్ర మోడీ ఏకంగా 35% (ముప్పై ఐదు శాతం) ముందున్నారు. ఇలా ప్రధానమంత్రి రేసు లో నరేంద్ర మోడీ  ఎదురులేకుండా   దూసుకుపోతూ ఉన్నారు. ఏప్రిల్ 20వ తేదీ ఈ అధ్యయనాన్ని చేసినట్టుగా ఆ అధ్యయన సంస్థ  ప్రకటించింది. మోడీ కాదంటే ప్రధానమంత్రిగా ఎవరన్న అంశంలో రెండో సమాధానం రాహుల్ గాంధీనే అయిన ప్పటికీ, నమో కి - రాగా కు మధ్యన వ్యత్యాసం ఒక అఘాధమే! 
Poll-Survey
ప్రత్యేకించి హర్యానా - హిమాచల్ ప్రదేశ్ - గుజరాత్ - రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో నమో పట్ల అనుకూలత “ఏకంగా డెబ్బై శాతం” ఉండటం విశేషం! గుజరాత్, రాజస్థాన్, మద్యప్రదేశ్  రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల్లో ఈమద్యనే బిజేపి ఓటమి చవిచూడగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది.   ఇంతలోనే ప్రధాని అభ్యర్ధిత్వానికి నమోనే ఎన్నుకున్నారంటే కాంగ్రెస్ పాలనలోని “మంట-సెగ” ఎలా అంటుకుంటుందో జనాలకు తెలిసొచ్చి ఉంటుంది. ముక్కుకోసినా ముందటోడే మెరుగన్న సామెత ఋజువై ఉంటుందని అంటున్నారు జనం. 
Image result for c voter IANS Tracker Latest Report
నిన్న చంద్రబాబు ఈవిఎంలలోని లోపాలను ఎత్తి చూపుతూ వాటిని రష్యన్లు హాక్ చేయగలరని అంత ఘట్టిగా చెపుతుంటే గత మూడుసార్లు ముఖ్యమంత్రైన ఆధునిక సాంకేతిక శాస్త్ర పితామహుడు చంద్రబాబు  ఇంతగా గగ్గోలు పెడుతున్నారంటే – 2014 నాడు నమో పై మోహంతో ఏవో కొన్ని బలహీన క్షణాల్లో బాబు తన మూడు సార్లు ఎన్నికల గెలుపు రహస్యం చెప్పేయగా అదే వ్యూహం నమో ఈ 2019 ఎన్నికల్లో వాడేసి ఉంటారన్న భయం ఆయన్ని వెంటాడుతుండవచ్చు.
Image result for c voter IANS Tracker Latest Report
“కొన్ని బలహీన క్షణాల్ని ఇప్పుడు నమో ఎంకాష్ చేసుకొన్నాడా? ఏమో? బాబులోని భగభగలకు గుబులు రేపే సెగలకు అదే కారణమా? జగన్ ఎన్నికలవగానే చల్లగా స్విట్జర్లాండ్ జారు కొని ఎంజోయి చేస్తుంటే, 150 సీట్లలో గెలుపు తనదేనని చెప్పే చంద్రబాబు – చెమటలు పట్టేలా దేశ దిమ్మరిగా తిరగటమేంటో? కొంచెం ఆ మర్మం గుట్టు విప్పవయ్యా తిరుమలేశా! అయినా నీ బంగారం దొబ్బేశారని బాబు మీద అనుమానమేమో! అంటారు జనం! చెప్పు బాబు! చెప్పు ఈశా! 

Image result for chandrababu with evm agitation

మరింత సమాచారం తెలుసుకోండి: