ఉగ్రవాదులు శ్రీలంకపై పడగవిప్పుతున్నారు.   వరుస దాడులతో శ్రీలంక ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు.  శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేళ్లుల్లలో దాదాపు 350 మరణించినట్లుగా సమాచారం అందుతోంది. వేలాది మంది గాయాల పాలు అయ్యారు. విహార యాత్రకు అంటూ వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు.  రాజధాని కొలంబోకు సమీపంలో తూర్పు వైపున ఉన్న పుగోడా పట్టణంలో ఈరోజు మరో పేలుడు సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఈ సందర్భంగా పోలీసు శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర మాట్లాడుతూ, పుగోడాలోని మేజిస్ట్రేట్ కోర్టు వెనుకవైపు ఉన్న ఖాళీ స్థలంలో పేలుడు సంభవించిందని చెప్పారు.  శ్రీలంకలో భయానక వాతావరణం ఇంకా తొలిగిపోలేదు.  మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో భద్రతను మరింత పెంచాలని, సైన్యానికి మరిన్ని అధికారాలు ఇవ్వాలని పార్లమెంట్ నిర్ణయించింది. నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) ఉగ్రసంస్థతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న మరో 16 మందిని అరెస్టు చేశారు.

పేలుళ్లలో మృతిచెందిన 10 మంది భారతీయుల్లో తొమ్మిది మృతదేహాలు భారత్‌కు వచ్చాయి. మొత్తం నాలుగు ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను తరలించామని శ్రీలంకలో భారత హైకమిషన్ తెలిపింది. కాగా,  పుగోడా పట్టణంలో ఈరోజు మరో పేలుడు సంభవించింది.  ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: