రెడ్డి రాజ్యాల గురించీ, వివిధ రెడ్డి సంస్ధానాల గురించీ చరిత్ర గ్రంథాలు కొన్ని వెలువడ్డాయి. రెడ్డి రాజులకు సంబంధించిన దాదాపు 200 శాసనాలు వెలుగు చూశాయి. రెడ్డి రాజులు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాలు, అపురూపమైన వాస్తు, శిల్ప సంపద కొంత పరిచతమయ్యాయి. రెడ్డి రాజుల కళా, సాహిత్య పోషణ, వారి కాలం నాటి సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక స్థితిగతులు, వివిధ రాజుల వ్యక్తిత్వ విశేషాలు - వీటిని గురించి చర్చించిన అపూర్వ పరిశోధక గ్రంథం 


మల్లపల్లి సోమశేఖర శర్మ ఇంగ్లీషులో రచించిన హిస్టరీ ఆఫ్‌ ది రెడ్డి కింగడమ్స్‌  సుమారు క్రీ.శ. 1325-1448. ఈ గ్రంథాన్ని 1948లో ఆంధ్ర విశ్వ విద్యాలయం ప్రచురించింది. అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య 1993 లో పునర్ముద్రించింది.  ఈ గ్రంథంలో దాదాపు 125 సంవత్సరాల రెడ్డి రాజ్యాల కాలంలోని సమాజ చరిత్ర చిత్రణ కన్పిస్తుంది. 

చరిత్రకు మౌనసాక్ష్యాలు అప్పట్లో రెడ్డి రాజులు నిర్మించిన గిరి దుర్గాలు — మట్టి, రాతి, ముళ్ళు ఇలా ఏడెనిమిది కుడ్యాలున్న కోటలు. ఈ కోటలోని ప్రతి రాయి అప్పట్లో జరిగిన ఎన్నో విషయాలను మౌనంగానే చెబుతాయి. అందుకే చరిత్ర లోతుల్లోకి వెళ్లి రెడ్డి రాజుల చ్రిత్ర అప్పటి విషయాలను వెలికి తీయాలనుకునే వారికి మొదట గుర్తుకు వచ్చేది కోటలు. అటువంటి ఎన్నో కోటలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. 

అందులో కొండవీడు కోట కూడా ఒకటి. రెడ్డి రాజుల పౌరుషత్వానికి నిలువుటద్దమైన ఈ కోటకు సంబంధించిన వివరాలు పవన్ కళ్యాన్ కోసం కాదు గాని పర్యాటకం కోసం సరదాగా మీ కోసం: 
Image result for reDDy kings in history
ఆంధ్రప్రదేశ్ లోని గిరి దుర్గాల్లో అత్యంత ప్రముఖమైనది కొండవీడు కోట. రెడ్డిరాజుల పౌరుషానికి నిలువెత్తు సాక్షమైన ఈ కోట గుంటూరు జిల్లా యడ్లపాడుకు సమీపంలో ఉంది. చిలకలూరి పేట గుంటూరు మధ్య వెళ్లే జాతీయ రహదారి వెంబడి వెలితే ఈ కోటను సులభంగా చేరుకోవచ్చు. ఈ కోట, జాతీయ రహదారికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా గుంటూరు నరసరావుపేట మార్గంలో ఫిరంగిపురం మీదుగా కొండవీడు చేరుకొనేందుకు మరో మార్గం ఉంది. మొత్తంగా గుంటూరు నుంచి కొండవీడుకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ అద్భుతమైన కోట ఉంది. ఈ కోట నిర్మాణం క్రీ.శ.1300 సంవత్సర కాలానికి చెందినది. అప్పటికి భారత్లోకి ఆంగ్లేయులు ప్రవేశించలేదు. వారు ఆపాటికి ఇంకా సరైన సంస్కృతిని అలవాటు చేసుకోలేదు కూడా! చరిత్రకు సాక్షిగా నిలిచిన ఈ కోట ప్రస్తుత యువతరానికి ట్రెక్కింగ్ విషయంగా స్వర్గధామం. అందువల్లే వీకెండ్ సమయంలో ఇక్కడకు యువత ఎక్కువగా ట్రెక్కింగ్ చేయడానికి వస్తుంటారు. అంతేకాకుండా రాక్ క్లైంబింగ్ కు కూడా ఇక్కడ అవకాశం ఉంది. 
Related image
శత్రుదుర్భేద్యమైన ఈ గిరి దుర్గాన్ని రాజధానిగా చేసుకొని క్రీస్తుశకం 1325 నుంచి 1420 వరకూ రెడ్డిరాజులు ప్రజారంజకంగా పరిపాలించారు. ఈ కోటలో 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు ఉన్నాయి. అదే విధంగా కోట లోపల ఉన్న సైనికుల నీటి అవసరాలు తీర్చడానికి వీలుగా మూడు చెరువులను నిర్మింప జేశారు. ఒకటి నిండ గానే నీరు వృథా కాకుండా మరో రెండు చెరువు ల్లోకి వెళ్లేలా గొలుసు చెరువుల నిర్మించిన తీరు అమోఘం. 
Image result for reDDy kings in history
ఈ కోటలో అనేక దేవాయాలు ఉన్నాయి. ముఖ్యంగా కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి దేవాలయాలు కొండ దిగువన వీరభద్రస్వామి దేవాలయం, రామలింగేశ్వరస్వామి దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అపార శిల్పసంపద తో కూడిన రాతి కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ చూసినా రాతి శిల్పాలు ఆనాటి శిల్పుల శిల్ప కళా చాతుర్యానికి ప్రత్యక్ష ఉదాహరణలు. చరిత్ర అంటే ఎక్కువ ఇష్టపడే వారేకి ఈ కొండవీడు ప్రాంతం తప్పక నచ్చుతుంది.
Related image
వేలపుస్తకాలు చదివానన్న మెగా పవర్ స్టార్ & జనసేన అధినేత - పవన్ కళ్యాణ్ చదవటం చాలా అవసరం. రెడ్డి రాజుల పాలనను గురించి తెలుసుకోవాలంటే హిస్టరీ ఆఫ్‌ ది రెడ్డి కింగడమ్స్‌ చదవటం అవసరం. రెడ్డి రాజుల కాలం నాటికి ఆధునిక యూరప్ ఇంకా రూపుదిద్దుకోలేదుబ్రిటీష్ వారి నాగరికత ఉన్నా చాలా ఆదిమ దశ లోనే ఉంది. ఆధునిక యూరప్ పారిశ్రామిక విప్లవం నాటికి అంటే  1600 సంవత్సరం నాటికి మొదలైంది. ఆతరవాతో? లేదా అరోజుల్లోనే బ్రిటీష్ మరియు ఇతర యూరప్ వారు వలస రాజ్యాల స్థాపన మొదలు పెట్టారు. "రెడ్డి" అనేది బ్రిటీష్ వారిచ్చిన రివార్డో అవార్డో కాదు. "రెడ్డి" వర్గం వారు ఒక్క సమూహానికి మాత్రమే చెందిన వారు కాదు వీరు దక్కను పర్వత కనుమలకు చెందిన అనేక సమూహాల కలయిక అని, వీరి మూలాలు కాకతీయుల కాలం నాటికి చిన్న చిన్న రాజ్యాలను పాలించే స్థాయికి వృద్ధి చెందిందని అని చరిత్ర చెపుతుంది.

మనం చదివే మహాభారతం "ఎర్రాప్రగడ" విరచితం. ఆయన ప్రోలయ వేమారెడ్ది ఆస్థాన కవి. ఆ గ్రంధం బ్రీటీష్ వాళ్లు ముఖ్యంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పలుమార్లు చదివారు.  

Image result for charles philip brown

Image result for charles philip brown telugu hand writing sumati Satakam

చార్లెస్ ఫిలిప్ బ్రౌణ్ దస్తూరితో రాసిన సుమతీ శతక పద్యం


Image result for charles philip brown telugu hand writing sumati Satakam

కులరహిత సమాజాన్ని నిర్మించాలంటే కులాలపై తప్పుడు సమాచారం ఇవ్వనవసరం లేదు. కులాలపై మరో ప్రత్యేక వ్యాసంలో చర్చిద్ధాం! 

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: